రక్తపాతం సృష్టించడానికి సిద్ధమైన నాని.. ప్యారడైజ్ రిలీజ్ డేట్ లాక్..!

Divya
నాచురల్ స్టార్ నాని, డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో రాబోతున్న పాన్ ఇండియా చిత్రం ది ప్యారడైజ్. దసరా సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న వీరిద్దరూ మళ్లీ ఆ తర్వాత కలిసి ఈ సినిమా చేస్తుండడంతో అంచనాలు పెంచేశాయి. ముఖ్యంగా గ్లింప్స్ గత ఏడాది విడుదల కాగా అదిరిపోయే రెస్పాన్స్ లభించింది. గత కొద్ది రోజులుగా విడుదల తేదీ పైన పలు రకాల వార్తలు వినిపించాయి. అయితే ఇప్పుడు తాజాగా చిత్ర బృందం సినిమా విడుదల తేదీన అధికారికంగా ప్రకటించింది. ఈ యాక్షన్ డ్రామా చిత్రం 21 ఆగస్టు-2026 ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయబోతున్నారు.


ఇందుకు సంబంధించి విడుదల చేసిన  పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. విడుదల తేదీ అనౌన్స్  చేస్తూ రిలీజ్ చేసిన పోస్టర్లో రెండు జడలు వాటి చివరన రక్తం కారుతున్నట్లుగా చూపించి జడల మధ్యలో విడుదల తేదీని ప్రకటించారు. హీరో నాని ఇందులో ఊర మాస్ పాత్రలో కనిపించబోతున్నారు. ఈ చిత్రాన్ని ఇంగ్లీష్, బెంగాలీ ,స్పానిష్ వంటి భాషలలో కూడా విడుదల చేసేలా చూస్తున్నారు. నాని కి జోడీగా కాయాదు లోహర్ హీరోయిన్గా నటిస్తోంది. అలాగే మోహన్ బాబు, సంపూర్ణేష్ బాబు తో పాటుగా మరి కొంతమంది నటీనటులు   కూడా నటిస్తున్నారు.


మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ ఈ చిత్రానికి సంగీతం అందించడం మరింత ప్లస్ గా మారింది. మరి ఈ సినిమాతో నాని ఎలాంటి రికార్డులను తిరగ రాస్తారో చూడాలి మరి. 2025లో నాని డైరెక్టర్ శైలేష్ కొలను కాంబినేషన్లో వచ్చిన  హిట్ 3 సినిమా అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. ఇందులో నాని యాక్టింగ్ కూడా హైలెట్ గా నిలిచింది. నాని సినిమాల విషయానికి వస్తే ది పేరడైజ్ సినిమా అయిపోయిన తర్వాత డైరెక్టర్ సుజిత్ తో సినిమా చేయబోతున్నట్లు వినిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: