శర్వానంద్ మూవీలో ఆ సీనియర్ హీరో..సినిమా సగం హిట్ అయిపోయిన్నట్లే పో..!?

Thota Jaya Madhuri
 టాలీవుడ్‌లో మరో ఆసక్తికరమైన కాంబినేషన్ తెరపైకి రాబోతోంది. హీరో శర్వానంద్ – దర్శకుడు శ్రీను వైట్ల కాంబినేషన్‌లో తెరకెక్కబోయే కొత్త సినిమా ప్రస్తుతం ఇండస్ట్రీలో మంచి బజ్ క్రియేట్ చేస్తోంది. ఇప్పటికే ప్రీ-ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్న ఈ సినిమా, జూన్ నెల నుంచి రెగ్యులర్ షూటింగ్‌ను ప్రారంభించుకోనుందని తాజా సమాచారం. ఈ ప్రాజెక్ట్‌పై మేకర్స్ చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నట్లు తెలుస్తోంది.ఇప్పటికే బయటకు వచ్చిన సమాచారం ప్రకారం, ఈ సినిమాలో శర్వానంద్ పాత్ర చాలా ప్రత్యేకంగా ఉండబోతుందట. గతంలో చేసిన పాత్రలకు భిన్నంగా, ఈసారి ఆయన ఫ్రెష్ లుక్‌తో పాటు కొత్త బాడీ లాంగ్వేజ్‌ను ట్రై చేయబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. శ్రీను వైట్ల మార్క్ కామెడీ, యాక్షన్ ఎలిమెంట్స్‌తో పాటు శర్వానంద్‌కు సూటయ్యే క్యారెక్టర్ డిజైన్‌పై ప్రత్యేక శ్రద్ధ పెట్టినట్లు సమాచారం.

ఇక ఈ సినిమాలో మరో కీలక అంశం ఏమిటంటే, శర్వానంద్ పాత్రతో పాటు ఒక స్ట్రాంగ్ నెగిటివ్ షేడ్ ఉన్న స్పెషల్ క్యారెక్టర్ కూడా ఉండబోతోందట. ఆ పాత్రలో టాలీవుడ్ సీనియర్ హీరో జగపతి బాబు కనిపించనున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే విలన్‌, గ్రే షేడ్ పాత్రల్లో తనదైన ముద్ర వేసుకున్న జగపతి బాబు, ఈ సినిమాలో కూడా పవర్‌ఫుల్ పాత్రలో దర్శనమివ్వనున్నారని టాక్. ఆయన ఎంట్రీతో సినిమాపై అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి.హీరోయిన్ విషయంలో కూడా మేకర్స్ ఫ్రెష్ ఛాయిస్‌ను తీసుకున్నట్లు తెలుస్తోంది. ‘మ్యాడ్’, ‘8 వసంతాలు’ సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న అనంతిక సనీల్ కుమార్‌ను ఈ సినిమాకు హీరోయిన్‌గా ఫిక్స్ చేసినట్లు ఇప్పటికే వార్తలు వచ్చాయి. యంగ్ టాలెంట్‌కు ఛాన్స్ ఇవ్వడంలో ముందుండే శ్రీను వైట్ల, ఈసారి కూడా కొత్త ఎనర్జీని సినిమాకు తీసుకురావాలని భావిస్తున్నట్లు కనిపిస్తోంది. శర్వానంద్ – అనంతిక కాంబినేషన్ తెరపై ఎలా ఉండబోతుందో చూడాలని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

దర్శకుడు శ్రీను వైట్ల విషయానికి వస్తే, గతంలో ఆయన తెరకెక్కించిన గోపీచంద్ హీరోగా వచ్చిన యాక్షన్ కామెడీ ‘విశ్వం’ ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయింది. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద ఏవరేజ్‌గా నిలవడంతో, శ్రీను వైట్ల తన తదుపరి సినిమాపై చాలా కేర్ తీసుకుంటున్నారని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో శర్వానంద్‌తో చేస్తున్న ఈ సినిమా ఆయనకు చాలా కీలకంగా మారింది. తన స్టైల్‌కు తగ్గ స్క్రిప్ట్‌తో పాటు, స్ట్రాంగ్ క్యాస్టింగ్, కమర్షియల్ ఎలిమెంట్స్‌తో మళ్లీ ఫుల్ ఫామ్‌లోకి రావాలని శ్రీను వైట్ల గట్టిగా ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.ఇక ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనున్న విషయం తెలిసిందే. ఇప్పటికే టాలీవుడ్‌లో ఎన్నో బ్లాక్‌బస్టర్స్‌ను అందించిన ఈ నిర్మాణ సంస్థ, ఈ ప్రాజెక్ట్‌ను కూడా భారీ స్థాయిలో తెరకెక్కించేందుకు సిద్ధమవుతోందట. ప్రొడక్షన్ వాల్యూస్ విషయంలో ఎలాంటి రాజీ లేకుండా సినిమాను తెరకెక్కించనున్నారని టాక్. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ ఉండటంతో సినిమా మీద ట్రేడ్ వర్గాల్లో కూడా మంచి నమ్మకం ఏర్పడింది.

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: