బాలయ్యకు తేజస్విని... చిరుకి సుస్మిత.. !
బాలయ్యకు 'అన్‌స్టాపబుల్' బూస్టప్ - తేజస్విని వ్యూహం :
బాలకృష్ణలోని అసలైన ఫన్ యాంగిల్‌ను, ఆయన స్పాంటేనిటీని ప్రపంచానికి చూపించాలనే ఆలోచన తేజస్వినిదే. తేజస్విని ప్రోత్సాహంతోనే బాలయ్య ఓటీటీ రంగంలోకి అడుగుపెట్టి 'అన్‌స్టాపబుల్' షోతో సెన్సేషన్ క్రియేట్ చేశారు. ఇది ఆయన ఇమేజ్ను పూర్తిగా మార్చేసింది.
డాకు మహారాజ్:
దర్శకుడు బాబీతో బాలయ్య చేసిన తాజా చిత్రం 'డాకు మహారాజ్' విషయంలోనూ తేజస్విని ఇన్పుట్స్ చాలా ఉన్నాయని సమాచారం. అభిమానులు కోరుకునే మాస్ ఎలిమెంట్స్, వింటేజ్ బాలయ్య వైబ్ ఉండేలా ఆమె కథా చర్చల్లో పాల్గొని తండ్రికి బ్యాక్ ఎండ్ సపోర్ట్‌గా నిలిచారు.
చిరంజీవి వింటేజ్ ఎనర్జీ - సుస్మిత ప్లానింగ్ :
చాలా కాలంగా మెగా ఫ్యాన్స్ చిరంజీవిని 'ఘరానా మొగుడు', 'రౌడీ అల్లుడు' వంటి సినిమాల్లోని ఎనర్జీతో చూడాలని ఆశపడుతున్నారు. వారి ఆశను 'మన శంకరవరప్రసాద్' సినిమాతో సుస్మిత నెరవేర్చారు.
గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై సుస్మిత ఈ సినిమా నిర్మాణంలో భాగస్వామి అయ్యారు. అనిల్ రావిపూడి వంటి మాస్ పల్స్ తెలిసిన దర్శకుడిని ఎంచుకోవడంలోనూ, చిరు కామెడీ టైమింగ్ ఎలివేట్ అయ్యేలా చూసుకోవడంలోనూ ఆమె చొరవ చూపారు. సంక్రాంతికి పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్ కావాలని భావించి, తండ్రి ఇమేజ్‌కు సరిపోయే కథను పట్టాలెక్కించి సక్సెస్ అయ్యారు.
వెంకీ, నాగ్ కూడా ఫాలో అయితే..
సీనియర్ స్టార్స్ విషయంలో వాళ్ల పిల్లలు తీసుకుంటున్న ఈ శ్రద్ధ మంచి ఫలితాలను ఇస్తోంది. ఇదే పద్ధతిని విక్టరీ వెంకటేష్, నాగార్జున కూడా ఫాలో అయితే, వారి నుంచి కూడా ఫ్యాన్స్ ఆశించే కమర్షియల్ హిట్లు వచ్చే అవకాశం ఉంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు. తండ్రి ఇమేజ్ పడిపోకుండా, ప్రస్తుత ట్రెండ్‌కు తగ్గట్లుగా వారిని ప్రజెంట్ చేయడంలో ఈ 'మెగా & నందమూరి' డాటర్స్ సక్సెస్ అయ్యారు. అందుకే ఇప్పుడు సోషల్ మీడియాలో ఫ్యాన్స్ ఈ ఇద్దరు స్టార్ తనయురాళ్లకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నారు.