అఖండ 2 : ప్రీమియర్లతోనే అదర గొట్టేస్తోందిగా... !
నందమూరి నటసింహం బాలకృష్ణ నటించిన అఖండ 2 - తాండవం సినిమా ప్రీమియర్ల తోనే అదర గొట్టేస్తోంది. సినిమాకు మిక్స్ డ్ టాక్ వచ్చినా కూడా సినిమా పై ముందు నుంచి ఉన్న హైప్ నేపథ్యంలో వసూళ్ల పరంగా అదర గొడుతోంది. ప్రీమియర్ల తో ఏరియాల వారీగా మంచి వసూళ్లు వస్తున్నట్టు ట్రేడ్ వర్గాల లెక్కలు చెపుతున్నాయి. ఇక కొన్ని సెంటర్లలో కేవలం నాలుగైదు షోలకే భారీ వసూళ్లు రాబట్టింది. ఏలూరు 9 ప్రీమియర్ షోలకు రు. 13 లక్షల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. అలాగే తాడేపల్లిగూడెం 5 ప్రీమియర్ షోస్ కు రు. 5.4 లక్షలు వచ్చాయి. ఇక రాయలసీమ లో బాలయ్య సినిమాలకు కంచుకోట అయిన మదనపల్లి ప్రీమియర్స్ కు రు. 13.54 లక్షలు వచ్చాయి.
అలాగే బాలయ్య సినిమాలకు కంచుకోట అయిన కడప జిల్లాలోని ప్రొద్దుటూరు ప్రీమియర్స్ కు 8.3 లక్షలు వచ్చాయి. ట్రేడ్ వర్గాలు కడుతోన్న లెక్కల ప్రకారం అఖండ 2 - తాండవం తొలి రోజు ప్రపంచ వ్యాప్తంగా రు. 50 కోట్ల కు పైగానే గ్రాస్ వసూళ్లు రాబడుతుందని అంటున్నారు. ఫస్ట్ వీకెండ్ లో సినిమా పెర్పామెన్స్ ఎలా ? ఉంటుంది అనే దాని మీదే సినిమా బ్రేక్ ఈవెన్ ఎంత వరకు అవుతుంది అన్నది ఆధార పడి ఉంది.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు.