రాజాసాబ్ చిత్రానికి అఖండ 2 కష్టాలేనా?
డిసెంబర్ 5న విడుదల అవుతుందని అభిమానులందరూ ఫిక్స్ అయ్యారు. కానీ తీరా చివరి క్షణాలలో చూస్తే ఈ సినిమా వాయిదా పడింది. దీంతో అభిమానులు తీవ్రస్థాయిలో నిరాశ అవుతున్నారు. అఖండ 2 నిర్మాణ సంస్థ గతంలో చేసిన కొన్ని సినిమాల ప్రభావం వల్ల ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవడంతో ఈ సినిమా విడుదల తాత్కాలికంగా వాయిదా వేసినట్లుగా మేకర్స్ తెలియజేశారు. త్వరలోనే ఈ సమస్యకు నిర్మాతలు పరిష్కారం చూస్తున్నట్లు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది.
ఇదంతా బాగానే ఉన్నా ఇప్పుడు ప్రభాస్ అభిమానులలో కూడా ఇదే భయం పట్టుకున్నట్లు వినిపిస్తోంది. ప్రభాస్, డైరెక్టర్ మారుతి కాంబినేషన్ లో వస్తున్న రాజాసాబ్ సినిమాకి కూడా ఇలాంటి సమస్య ఎదురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు టాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాని నిర్మిస్తున్న సంస్థకు కూడా ఆర్థిక లావాదేవీలలో సమస్యలు ఉన్నట్లు వినిపిస్తున్నాయి. అవన్నీ సెట్ చేస్తే కాని రాజాసాబ్ సినిమా విడుదల కాదు అనే టాక్ ఇండస్ట్రీలో ఎక్కువగా వినిపిస్తోంది. ఒకవేళ ఇదే కనుక జరిగితే ప్రభాస్ ఫ్యాన్స్ కూడా బాలయ్య ఫ్యాన్స్ లాగానే బాధపడాల్సి ఉంటుంది. 2026 జనవరి 9 న రాజాసాబ్ సినిమా విడుదల కావాలి. మరి కొంచెం తేడా వచ్చిన ఈసారి సినిమా వాయిదా పడే అవకాశం ఉంటుందని వినిపిస్తోంది. ఇప్పుడు ఆఖండ 2 కి జరిగిన విషయాన్ని దృష్టిలో పెట్టుకొని నిర్మాతలు ముందుగా జాగ్రత్తలు తీసుకుంటారేమో చూడాలి మరి.