రాసి పెట్టుకోండి..ఆ విషయంలో నెక్స్ట్ లిస్ట్ లో ఉండబోయేది మహేశ్ బాబునే..నో డౌట్..!

Thota Jaya Madhuri
దర్శకధీరుడు ఎస్‌.ఎస్‌.రాజమౌళి–సూపర్ స్టార్ మహేశ్ బాబు కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటున్న పాన్ వరల్డ్ యాక్షన్ అడ్వెంచర్ ‘వారణాసి'. ప్రస్తుతం ఇండియన్ సినిమాల్లోనే అత్యంత భారీగా చర్చకు వస్తున్న ప్రాజెక్ట్‌గా మారింది. రాజమౌళి కెరీర్‌లో ప్రతి సినిమా సరికొత్త బెంచ్‌మార్క్‌ సెట్ చేసిన విషయం తెలిసిందే. మరి అలాంటి దర్శకుడితో మహేశ్ బాబు తొలిసారి పనిచేస్తుండటం వల్ల ఈ సినిమాకు ఆరంభం నుంచే అద్భుత స్థాయి హైప్ ఏర్పడింది.
ఈ సినిమాలో మహేశ్ బాబు ‘రుద్ర’ అనే పాత్రలో కనిపించనున్నారని సమాచారం. ఇప్పటివరకు మహేశ్ ఎప్పుడూ కనిపించని విధంగా, అత్యంత రగ్గుడ్‌, పవర్‌ఫుల్ లుక్స్‌తో ప్రేక్షకులను షాక్‌కు గురిచేయనున్నారట. రాజమౌళి ప్రత్యేక యాక్షన్ డిజైన్, హాలీవుడ్ రేంజ్ టెక్నికల్ స్టాండర్డ్స్ ఈ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్తున్నాయి. ఈ పాత్ర మహేశ్ కెరీర్‌లోనే ఒక మైల్‌స్టోన్ అవుతుందని ఇండస్ట్రీ టాక్.



ఈ సినిమాలో గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా, మలయాళ  స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. రాజమౌళి సినిమాల్లో ఎప్పుడూ సపోర్టింగ్ రోల్స్ కూడా బలంగానే రాసుకుంటాడు. ఈసారి కూడా పృథ్వీరాజ్, ప్రియాంక పాత్రలు కథకు అత్యంత కీలకం అన్న గుసగుసలు వినిపిస్తున్నాయి.ప్రస్తుతం చిత్రీకరణ వేగంగా జరుగుతుండగా, రాజమౌళి తన ప్రతి షెడ్యూల్‌ను అత్యంత హై లెవల్ లో హాలీవుడ్ తరహాలో ప్లాన్ చేస్తున్నాడట. ఈ సినిమా అడ్వెంచర్, మిస్టిసిజం, యాక్షన్, డ్రామా—అన్ని ఒక్కటిగా ఉండబోతోందని టీమ్ చెబుతున్నట్లు సమాచారం.



ఇదిలా ఉండగా, సినిమా షూటింగ్ ఇంకా పూర్తికాక ముందే, ఈ చిత్ర డిజిటల్ హక్కుల కోసం ప్రముఖ ఓటీటీ దిగ్గజాలు ఒకరి కంటే ఒకరు భారీ మొత్తాలు ఆఫర్ చేస్తున్నారట. ఇండస్ట్రీలో వినిపిస్తున్న తాజా సమాచారం ప్రకారం—“వర్తమాన పరిస్థితుల్లో, ఈ సినిమా డిజిటల్ రైట్స్ డీల్ రూ.1000 కోట్ల వరకు వెళ్లొచ్చని పెద్ద పెద్ద ఓటీటీలు ఇంటర్నల్లీ చర్చలు జరుపుతున్నాయి” అని తెలుస్తోంది.ఇది నిజమైతే, భారతీయ సినీ చరిత్రలో ఇప్పటివరకు ఎప్పుడూ వినిపించని రేంజ్‌లో డిజిటల్ డీల్ ఇది అవుతుంది. రాజమౌళి–మహేష్ కాంబినేషన్‌లో వస్తున్న సినిమా కావడంతోనే ఓటీటీ సంస్థలు ఈ స్థాయి భారీ ఆఫర్లకు సిద్ధమవుతున్నాయని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.ప్రభాస్ ‘బాహుబలి’తో గ్లోబల్ రేంజ్ హిట్ అందుకుని ఇంటర్నేషనల్ స్టార్డమ్‌ సాధించిన విషయం తెలిసిందే. ఇక ఆ తర్వాత అదే స్థానం చేరుకోబోయేది మహేశ్ బాబేనని అభిమానులు ధైర్యంగా చెబుతున్నారు. రాజమౌళి దర్శకత్వం వల్ల ఈ సినిమా ఇంటర్నేషనల్ మార్కెట్స్‌లో కూడా భారీగా విడుదల కానుంది. ఇప్పటికే హాలీవుడ్ మీడియా కూడా ప్రాజెక్ట్‌పై ప్రత్యేక దృష్టి పెట్టింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: