వాయిదా పడటం అఖండ2 సినిమాకు ప్లస్ అయిందా.. అలాంటి రివ్యూలు రావడం పక్కా!
అఖండ2 సినిమా వాయిదా పడటంపై ప్రస్తుతం సినీ వర్గాల్లో ఆసక్తికర చర్చ నడుస్తోంది. ఈ వాయిదా వల్ల సినిమాకు మేలు జరిగిందా? అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. వాస్తవానికి, బ్లాక్‌బస్టర్ 'అఖండ' సినిమాకు సీక్వెల్‌గా వస్తున్నప్పటికీ, 'అఖండ2'పై మొదట్లో అనుకున్న స్థాయిలో భారీ అంచనాలు ఏర్పడలేదు. బుకింగ్స్ విషయంలో కూడా ఈ చిత్రం కొంతమేర నిరాశపరిచిందనే చెప్పాలి.
అయితే, ఫైనాన్షియల్ సమస్యల కారణంగా సినిమా వాయిదా పడటం 'అఖండ2'కు అనూహ్యంగా ప్లస్ పాయింట్‌గా మారే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు చెబుతున్నారు. గతం చూస్తే, పెద్ద సినిమాలకు విడుదల సమయంలో ఏదైనా అడ్డంకి లేదా వివాదం ఎదురైనప్పుడు, ఆ తర్వాత అవి విడుదలై అద్భుతమైన విజయాన్ని అందుకున్న సందర్భాలు చాలా ఉన్నాయి. ఉదాహరణకు, గతంలో 'అత్తారింటికి దారేది' సినిమాకు కొన్ని ఇబ్బందులు ఎదురు కాగా, ఆ తర్వాత ఈ సినిమాకు పూర్తిస్థాయిలో పాజిటివ్ రివ్యూలు వచ్చి, బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించింది.
నిర్మాతలకు ఈ సమయం మరింత ప్రమోషన్ చేసుకోవడానికి, అన్ని పనులను పూర్తి చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఆలస్యమైనా, మంచి నాణ్యతతో, పకడ్బందీగా సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుందనే నమ్మకం కూడా పెరుగుతుంది.
'అఖండ2' సినిమాకు కూడా అలాంటి సెంటిమెంట్ కలిసివచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పవచ్చు. తాజా పరిణామాల నేపథ్యంలో ప్రేక్షకుల్లో ఈ సినిమాపై మళ్లీ ఆసక్తి పెరిగే అవకాశం ఉంది. బాలకృష్ణ గారు, బోయపాటి శ్రీను కాంబినేషన్ అంటేనే మాస్ ప్రేక్షకులకు పూనకాలు తెప్పించే కాంబినేషన్. ఈ అఖండమైన శక్తి మరోసారి బాక్సాఫీస్‌ను షేక్ చేస్తుందని అభిమానులు గట్టిగా విశ్వసిస్తున్నారు. త్వరలో విడుదల కానున్న 'అఖండ2' మూవీ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల విషయంలో సంచలనాలు సృష్టించాలని, ప్రేక్షకులను అలరించాలని ఆశిద్దాం.
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు