కమర్షియల్ సినిమాలకు ఫుల్ స్టాప్! పవర్ఫుల్ పాత్రలతో మెరవనున్న బ్యూటీ....!
నాణ్యతకే ఓటు: "నేను డబ్బు, కీర్తి కోసం వెంపర్లాడటం లేదు. నా పాత్రలో ఏదైనా కొత్తదనం ఉండాలి. నటిగా నాకు ఛాలెంజ్ విసిరే పాత్రలకే నేను ప్రాధాన్యత ఇస్తాను. కేవలం గ్లామర్ కోసం చేసే రొటీన్ కమర్షియల్ సినిమాలకు నేను పూర్తిగా దూరంగా ఉంటాను. నా కెరీర్‌ను నాణ్యతతో మాత్రమే కొలుస్తాను." అని శ్వేత స్పష్టం చేసింది.
హీరోయిన్ కాన్సెప్ట్ మారింది: ఈ తరం ప్రేక్షకులకు కేవలం డ్యాన్స్‌లు, డ్యూయెట్లు చేసే హీరోయిన్స్ కంటే.. పాత్ర బలం ఉన్న నటులే ముఖ్యమని శ్వేతా బసు ప్రసాద్ బలంగా నమ్ముతుంది. అందుకే తన రాబోయే సినిమాల్లో కూడా బలమైన కథాబలం ఉన్న పాత్రలను ఎంచుకుంది.
బాలీవుడ్లో కొత్త వెలుగు!
టాలీవుడ్లో బ్రేక్ వచ్చినా.. మెయిన్ స్ట్రీమ్ హీరోయిన్గా స్థిరపడలేకపోయిన శ్వేతా.. ఇప్పుడు బాలీవుడ్, ఓటీటీలలో తన నటన పవర్‌ను చూపిస్తోంది. ‘మక్దీ’ వంటి చిత్రాలతో బాలనటిగా జాతీయ అవార్డు అందుకున్న ఈమె.. తనలోని టాలెంట్‌ను పూర్తిస్థాయిలో చూపించడానికి ఇప్పుడు సరైన వేదిక దొరికినట్లుగా భావిస్తోంది.కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలు, ఓటీటీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్న శ్వేతా.. ఇకపై తెలుగులో కూడా విభిన్నమైన, పవర్ఫుల్ పాత్రల్లో కనిపించడానికి సిద్ధంగా ఉంది. డబ్బును పక్కన పెట్టి, నటన విలువలకు ప్రాధాన్యత ఇస్తున్న ఈమె కెరీర్.. ఎంతోమందికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తుంది అనడంలో సందేహం లేదు!