అఖండ 2 : రిలీజ్ వాయిదా బిగ్ డ్యామేజ్ జరిగిపోయిందిగా...!
ఇప్పుడు టాలీవుడ్లో అత్యంత చర్చనీయాంశంగా నిలిచిన ప్రాజెక్ట్ ‘అఖండ 2’ వాయిదా. ఈ వాయిదా నిర్ణయం అభిమానుల్లో భారీ నిరాశను, అసహనాన్ని కలిగించింది. బ్యాలయ్య మాస్ ఇమేజ్‌కి, బోయపాటి శ్రీను శైలికి ఉన్న క్రేజ్ దృష్ట్యా ఈ సినిమా థియేటర్లలో సందడి చేసే రోజుకోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అంతలో చివరి క్షణంలో సినిమా రిలీజ్‌ను నిలిపివేయడం అందరనీ షాక్‌కు గురిచేసింది. ఇక సోషల్ మీడియా మాత్రం మేకర్స్‌పై భగ్గుమంటోంది. ఇలా చివరి నిమిషంలో అభిమానుల అత్యుత్సాహంపై నీళ్లు చల్లారని వాపోతున్నారు.
అయితే సినీ వర్గాల సమాచారం ప్రకారం నిర్మాణ సంస్థకు సంబంధించిన కొన్ని పెండింగ్ విషయాలు, డిస్ట్రిబ్యూషన్ ఫైనాన్షియల్ క్లారిటీలు పూర్తి కాలేకపోవడం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నారని టాక్. ఇలాంటి పరిస్థితుల్లో త్వరగా రిలీజ్ చేస్తే ప్రమాదం ఉండొచ్చనే ఉద్దేశంతోనే మేకర్స్ వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. దీంతో అఖండ 2 ఎప్పుడు రిలీజ్ అవుతుంది ? ఇదే ఇప్పుడు పెద్ద ప్రశ్న. అధికారిక ప్రకటన ఇంకా రాకపోయినా, ఇండస్ట్రీలో వినిపిస్తున్న మాట ప్రకారం రెండు నుంచి మూడు వారాల లోపే కొత్త రిలీజ్ డేట్ ప్రకటించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.
ఒరిజినల్ పార్ట్ బ్లాక్‌బస్టర్ కావడం వల్ల, రెండో భాగం మీద అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ హైప్ విడుదలవడానికి ఆలస్యం జరగడంతో ఉత్సాహం నీరు కారిపోనుంది. అయితే అటు అభిమానులు, ఇటు ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు.. ఓవరాల్‌గా తెలుగు సినీ ప్రేమికులు అందరూ తీవ్ర నిరాశలో ఉన్నారు. అయితే సినిమాలో కంటెంట్ బలంగా ఉంటే అది పెద్ద సమస్య కానే కాదు. బాలయ్య - బోయపాటి కాంబినేషన్‌కి థియేటర్లలో ఉన్న క్రేజ్ దృష్ట్యా మూవీ పాజిటివ్ టాక్ అందుకుంటే భారీ కలెక్షన్లు రాబట్టడం ఖాయం. మొత్తం మీద రిలీజ్ లేట్ అయినా సినిమా హిట్ అవుతుందన్న ధీమాతో ఫ్యాన్స్ ఉన్నారు.