అఖండ అంచనాల పై కన్ఫ్యూజన్ !
పవన్ కళ్యాణ్ ‘ఓజీ’ మూవీ తరువాత టాప్ హీరోల సినిమాలు ఏమీ విడుదల కాలేదు. దీనికితోడు ‘అఖండ 2’ ట్రైలర్ పై ఊహించిన స్థాయిలో స్పందన రాలేదు అన్నమాటలు కూడ వినిపిస్తున్నాయి. అయితే బాలకృష్ణ బోయపాటిల కాంబినేషన్ మూవీ కావడంతో ఈమూవీ బిజినెస్ భారీ స్థాయిలో జరిగింది అన్నవార్తలు వస్తున్నాయి.
ఈమూవీకి టోటల్ పాజిటివ్ టాక్ రాకుండా డివైడ్ టాక్ వస్తే మాత్రం ఈమూవీ బయ్యర్లకు కష్టాలు తప్పవు అని అంటున్నారు. ప్రస్తుతతరం యూత్ లో బాలకృష్ణ పట్ల చెప్పుకోతగ్గ స్థాయిలో మ్యానియా లేడు. దీనితో ఈమూవీకి హిట్ టాక్ వస్తే అందరూ ధియేటర్ల బాట పడతారు కానీ లేకుంటే ఈమూవీ కలక్షన్స్ మొదటి మూడురోజులకు పరిమితం అయ్యే ఆస్కారం ఉందని అని కొందరి అభిప్రాయం.
హిందు మత ధర్మ రక్షకుడుగా బాలకృష్ణ ‘అఖండ 2’ లో ప్రేక్షకులకు పూనకాలు తెప్పించే విధంగా నటించగలిగితే ఈమూవీ సక్సస్ చాల సులువుగా మారిపోతుంది. ఈమూవీలో హీరోయిన్ గా నటించిన సంయుక్తా మీనన్ పై యూత్ లో పెద్దగా క్రేజ్ లేదు. అదేవిధంగా ఈమూవీలో మెయిన్ విలన్ గా నటిస్తున్న ఇప్పటివరకు విలన్ గా నటించి మెప్పించిన సినిమాలు పెద్దగా లేవు. దీనితో ఈసినిమా భారం అంతా బాలకృష్ణ పైనే ఉంటుంది. అయితే ఈసినిమా కంటెంట్ మీద నమ్మకంతో ముందు రోజే ప్రీమియర్లు వేస్తున్నారు. ఏపీ తెలంగాణ వ్యాప్తంగా ఇవి ఉంటాయని నిర్మాత క్లారిటీ ఇచ్చారు. ఈమూవీ పై అర్ధరాత్రి వచ్చే టాక్ కోసంనందమూరి అభిమానులు చాల ఆశక్తిగా ఎదురు చూస్తున్నారు..