గర్ల్ ఫ్రెండ్: రష్మిక అంత తక్కువ రెమ్యునరేషన్ తీసుకుందా..?
ఈ సినిమాలో రష్మిక నటన, భావ వ్యక్తీకరణ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. విమర్శకులు కూడా ఆమె పెర్ఫార్మెన్స్‌ను విశేషంగా ప్రశంసిస్తున్నారు. సినిమాలోని ప్రతి ఫ్రేమ్‌లో ఆమె నటన ప్రాముఖ్యత సంతరించుకోవడంతో “ ది గర్ల్ ఫ్రెండ్ ” సినిమాకి మంచి బజ్ ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు రష్మిక పారితోషికం గురించి చర్చ మొదలైంది. ఇండస్ట్రీలో ప్రస్తుతం ఆమె అత్యధిక పారితోషికం పొందే హీరోయిన్లలో ఒకరు. సాధారణంగా తెలుగు చిత్రాలకు రూ.5 నుండి రూ.6 కోట్ల వరకు, బాలీవుడ్ చిత్రాలకు రూ.8 నుండి రూ.10 కోట్ల వరకు రెమ్యునరేషన్ అందుకుంటున్నారని సమాచారం.
అయితే, “ ది గర్ల్ ఫ్రెండ్ ” సినిమా విషయంలో మాత్రం రష్మిక ఓ ప్రత్యేక నిర్ణయం తీసుకున్నారని తెలిసింది. ఈ సినిమా కథ తనకు ఎంతో నచ్చడంతో “ రెమ్యునరేషన్ గురించి తర్వాత మాట్లాడుకుందాం ” అంటూ ముందుగానే మేకర్స్‌కు చెప్పారట. ఈ విషయాన్ని సినిమా యూనిట్ ప్రమోషన్ సమయంలోనే వెల్లడించింది. మేకర్స్ మాత్రం “ ఆమెకు తగిన పారితోషికం ఇవ్వడం మా బాధ్యత ” అని, అంతేకాకుండా “ డబుల్ రెమ్యునరేషన్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం ” అని చెప్పారు. సినీ వర్గాల సమాచారం ప్రకారం రష్మిక ఈ చిత్రానికి కేవలం రూ.3 కోట్ల పారితోషికమే స్వీకరించిందని టాక్ వినిపిస్తోంది. సినిమా షూటింగ్ కోసం ఆమె 50 రోజులకుపైగా సమయం కేటాయించినప్పటికీ, కథ పట్ల ఉన్న ప్రేమతో తక్కువ మొత్తానికి అంగీకరించిందని చెబుతున్నారు. మహిళా ప్రధాన కథలపై రష్మికకు ఎప్పటినుంచీ ప్రత్యేక మక్కువ ఉండటంతో ఈ నిర్ణయం తీసుకుందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.
ఏదేమైనా స్టార్ హీరోయిన్ స్థాయిలో ఉన్న రష్మిక మందన్న ఈ సినిమాకు తక్కువ పారితోషికం తీసుకోవడం పరిశ్రమలో అందరినీ ఆశ్చర్యపరిచింది. కమర్షియల్ సక్సెస్ కంటే మంచి కథలపై దృష్టి పెట్టడం ఆమె కెరీర్‌కి కొత్త మైలురాయిగా మారిందని సినీ విమర్శకులు అభిప్రాయపడుతున్నారు. “ది గర్ల్ ఫ్రెండ్” విజయంతో రష్మిక మరోసారి నటిగా తన ప్రతిభను, నిస్వార్థతను నిరూపించుకున్నట్లు స్పష్టమవుతోంది.