2026లో నాగ వంశీ బ్యానర్ నుండి అన్ని సినిమాలు రానున్నాయా.. పెద్ద రిస్కు చేస్తున్నాడుగా..?

Pulgam Srinivas
ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమలో అత్యంత బిజీ నిర్మాతగా కెరియర్ను కొనసాగిస్తున్న వారిలో సూర్య దేవర నాగ వంశీ ఒకరు. ఈయన బ్యానర్ నుండి ప్రతి సంవత్సరం చాలా సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. ఇక వచ్చే సంవత్సరం కూడా ఈయన బ్యానర్ నుండి చాలా సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. మరి వచ్చే సంవత్సరం నాగ వంశీ బ్యానర్ నుండి ఏ సినిమాలు రానున్నాయి అనే వివరాలను తెలుసుకుందాం.

విక్టరీ వెంకటేష్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ప్రస్తుతం ఓ మూవీ తెరకెక్కుతున్న విషయం మన అందరికి తెలిసిందే. ఈ మూవీ ని నాగ వంశీ నిర్మిస్తున్నాడు. ఈ సినిమాను వచ్చే సంవత్సరం విడుదల చేసే విధంగా నాగ వంశీ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. సూర్య హీరో గా వెంకీ అట్లూరి దర్శకత్వంలో ప్రస్తుతం ఓ మూవీ రూపొందుతుంది. ఈ మూవీ ని నాగ వంశీ నిర్మిస్తున్నాడు. ఈ సినిమాను కూడా వచ్చే సంవత్సరం విడుదల చేసే విధంగా నాగ వంశీ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. నవీన్ పోలిశెట్టి హీరోగా మీనాక్షి చౌదరి హీరోయిన్గా రూపొందుతున్న అనగనగా ఒక రాజు అనే సినిమాను నాగ వంశీ నిర్మిస్తున్నాడు.


ఈ మూవీ ని వచ్చే సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. విశ్వక్ సేన్ హీరోగా అనుదీప్ కే వీ దర్శకత్వంలో రూపొందిన ఫంకీ మూవీ ని నాగ వంశీ నిర్మిస్తున్నాడు. ఈ మూవీ ని వచ్చే సంవత్సరం విడుదల చేయనున్నారు. అఖిల్ హీరోగా రూపొందుతున్న లెనిన్ మూవీ ని కూడా వచ్చే సంవత్సరం విడుదల చేసే విధంగా ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. చందు మొండేటి దర్శకత్వంలో వాయుపుత్ర అనే టైటిల్ తో ఆనిమేటెడ్ సినిమాను రూపొందించనున్నట్లు ఆ మూవీ ని కూడా వచ్చే సంవత్సరం విడుదల చేసే ఆలోచనలో నాగ వంశీ ఉన్నట్లు తెలుస్తోంది. శ్రీ విష్ణు , సిద్దు జొన్నలగడ్డ కాంబో లో ఓ మూవీ ని రూపొందించనున్నట్లు ఆ మూవీ ని కూడా వచ్చే సంవత్సరం విడుదల చేసే ఆలోచనలో నాగ వంశీ ఉన్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: