రష్మిక ప్లేస్ ని రీప్లేస్ చేస్తున్న రుక్మిణి వసంత్.. మన నేషనల్ క్రష్ ఏం చెయ్యనుంది..?
ఇక తాజాగానే విజయ్ దేవరకొండ తో రష్మిక ఎంగేజ్మెంట్ చేసుకుందని సోషల్ మీడియాలో పుకార్లు వినిపిస్తున్న సంగతి తెలిసిందే . ఇది నిజమేనంటూ కొందరు గట్టిగా నమ్ముతున్నారు కూడా . కానీ ఇంతవరకు వీరిద్దరిలో ఎవరు కూడా అఫీషియల్ అనౌన్స్మెంట్ చేయలేదు . ఇక ఇదిలా ఉంటే తాజాగా రష్మిక మందన కాస్త పెళ్లి హడావిడిలో ఉంటే ఈ గ్యాప్ లో మరో ముద్దుగుమ్మ ప్లేస్ ని రీప్లేస్ చేస్తుంది . ఆమె రుక్మిణి వసంత్ . కాంతారావు మూవీతో మంచి పేరును సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ తాజాగా కాంతారా చాప్టర్ 1 లో కనిపించి మరింత ఫాలోయింగ్ ని తన సొంతం చేసుకుంది .
ఇక జూనియర్ ఎన్టీఆర్ వంటి స్టార్ హీరో సినిమాలలో ఛాన్స్ కొట్టింది ఈ బ్యూటీ . చాలెంజింగ్ రోల్స్ చేస్తూ తన సత్తా చాటుతుంది ఈ ముద్దుగుమ్మ . ఇక ప్రజెంట్ జూనియర్ ఎన్టీఆర్ తో డ్రాగన్ సినిమా చేస్తుండగా అనంతరం రామ్ చరణ్ సినిమాలో నటించిన ఉంది ఈ బ్యూటీ . అదేవిధంగా బాలీవుడ్ భారీ సినిమాల్లో కూడా రుక్మిణి వన్సన్ ఛాన్స్ కొట్టేసినట్లు తెలుస్తుంది . ఇక డ్రాగన్ మూవీ రిలీజ్ అయిన తరువాత ఈ ముద్దుగుమ్మ క్రేజ్ మరింత పెరుగుతుందని తన అభిమానులు ఆశిస్తున్నారు . ఇదే నిజమైతే ఈమె రేంజ్ అమాంతం పెరిగిపోతుందని చెప్పుకోవచ్చు . ఇక ప్రజెంట్ రష్మిక విజయ్ దేవరకొండ తో పెళ్లికి రెడీ అయింది . రష్మిక ప్లేస్ ని ఈ టైంలో రీప్లేస్ చేసేందుకు రుక్మిణి వసంత్ చాలా కష్టపడుతుందని చెప్పుకోవచ్చు . మరి ఏం జరగనోందో చూడాలి .