కల్కి సీక్వెల్ లో సాయి పల్లవి.. నాగ అశ్విన్ ఏం చేయనున్నాడు..?

lakhmi saranya
టాలీవుడ్ లో సంచలనం సృష్టించిన సినిమాలలో కల్కి మూవీ కూడా ఒకటి . ఇక ఇప్పుడు ఈ మూవీకి సీక్వెల్ వస్తున్న సంగతి తెలిసిందే . ఈ మూవీ సీక్వెల్ పై భారీ అంచనాలు కూడా ఉన్నాయి . నాగ్ అశ్విన్ డైరెక్షన్లో రూపొందుతున్న ఈ సైన్స్ ఫిక్షన్ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో రికార్డులు సృష్టించిన సంగతి మనందరికీ తెలిసిందే . ప్రభాస్ హీరోగా నటించిన ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ దీపిక పదుకొనే కీలక పాత్రలో కనిపించింది .


అయితే ఇటీవల మేకర్స్ వెల్లడించిన ప్రకారం సీక్వెల్లో దీపిక కనిపించబోరని స్పష్టం చేయడం జరిగింది . దీంతో ఈ చిత్రంలో ఆమె స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారు అనే ప్రశ్నలు వెల్లుడుతాయి . మొదట ఈ పాత్ర కోసం ఆలియా భట్ ను అప్రోచ్ అయినప్పటికీ.. ఆమె వేరే ప్రాజెక్టులతో బిజీ కారణంగా అందుబాటులో లేరని సమాచారం . ఇక ఇప్పుడు ఈ రోల్ కోసం సాయి పల్లవిని ఆలోచిస్తున్నారని సినీ వర్గాల టాప్ నడుస్తుంది . సాయి పల్లవి యాక్టింగ్ కి ఉన్న డెత్ ఆమె ప్రత్యేకమైన స్క్రీన్ ప్రజెంట్ ఈ పాత్రకు సరిపోతుందని నా అశ్విన్ భావిస్తున్నట్టు తెలుస్తుంది .


మరి నాగాస్విని నిజంగానే సాయి పల్లవిని ఈ పాత్ర కోసం అప్రోచ్ అయ్యాడా? సాయి పల్లవి ప్రాజెక్ట్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందా? అన్నా విషయాలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయని చెప్పొచ్చు . ఇప్పటికే సోషల్ మీడియాలో ఫాన్స్ ఈ కాంబినేషన్ పై ఆసక్తికరంగా చర్చించుకుంటున్నారు . అధికారిక పరాకటన వచ్చేవరకు ఈ చర్చలు కొనసాగుతాయని చెప్పుకోవచ్చు . ఈ సినిమాలో కనుక సాయి పల్లవి యాడ్ చేయడం నిజమే అయితే ఈ మూవీ పై మరిన్ని హైప్స్ పెరిగే అవకాశం ఉందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు .

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: