కృష్ణుడిగా, అర్జునుడిగా చిరంజీవి – కానీ తెరపైకి రాని డ్రీమ్ ప్రాజెక్ట్..!
కానీ ఇక్కడే ఒక ఇన్సైడ్ స్టోరీ ఉంది. ప్రముఖ వ్యాపారవేత్త, నిర్మాత టి. సుబ్బిరామిరెడ్డి ఒకప్పుడు చిరంజీవితో ఓ భారీ మైథలాజికల్ సినిమా ప్లాన్ చేశారని తెలిసింది. అందులో చిరు ఒకే సినిమాలో కృష్ణుడు – అర్జునుడు డ్యూయల్ రోల్ చేయాల్సి ఉండేది. ఇది నిజంగా సక్సెస్ అయితే, టాలీవుడ్లో ఒక కలల మైథలాజికల్ మూవీగా నిలిచేదని సినీ వర్గాలు అంటాయి. కానీ ఆ ప్రాజెక్ట్ కార్యరూపం దాల్చలేదు. ఈ విషయం సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ ఒక ఇంటర్వ్యూలో రివీల్ చేయడం ఇప్పుడు మళ్లీ హాట్ టాపిక్ అవుతోంది. ఇక ప్రస్తుతానికి చిరంజీవి వరుస ఫెయిల్యూర్స్‌తో కొంత ఇబ్బంది పడుతున్నా, తన స్టైల్ మాస్ మూవీస్‌తో మళ్లీ పుంజుకోవాలని రెడీ అవుతున్నాడు. యంగ్ టాలెంట్ వశిష్ట మల్లాడి డైరెక్షన్లో తెరకెక్కుతున్న ‘విశ్వంభర’ భారీ విజువల్ వండర్‌గా రాబోతోంది. మైథలాజికల్ ఫాంటసీ టచ్ ఉన్న ఈ సినిమా రిలీజ్ కోసం సిద్ధమవుతోంది.
అదే సమయంలో, కమర్షియల్ డైరెక్టర్ అనిల్ రావిపూడితో చిరంజీవి ఓ పక్కా కామెడీ ఎంటర్టైనర్ చేస్తున్నారు. ఇప్పటికే మూడు షెడ్యూల్స్ కంప్లీట్ కాగా, షూటింగ్ స్పీడ్‌గా కొనసాగుతోంది. ఇక ఆగస్టు 22న మెగాస్టార్ బర్త్‌డే సందర్భంగా ఈ సినిమా నుంచి టైటిల్ పోస్టర్ + స్పెషల్ గ్లింప్స్ రాబోతున్నాయట. ఫ్యాన్స్ కోసం ఇది ఒక మాస్ ఫెస్టివల్ లాంటిదే. ఇండస్ట్రీలో ఒకప్పుడు మైథలాజికల్ చిరంజీవి అనే కల ఆగిపోయినా, ఇప్పుడు ఆయన మళ్లీ ఫాంటసీ టచ్ ఉన్న ‘విశ్వంభర’ తో వస్తుండటంతో ఆ గ్యాప్ ఫిల్ అవుతుందా? అన్న ఉత్కంఠ అభిమానుల్లో మొదలైంది. మొత్తం మీద మెగాస్టార్ పాత డ్రీమ్ ఫెయిల్ అయినా, కొత్త డ్రీమ్ బ్లాక్‌బస్టర్‌గా మారే సమయం వచ్చేసింది.