తగ్గేదే లే అంటున్న బాలయ్య.. `అఖండ 2` కోసం మరోసారి అలా..!
ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ పూర్తయింది. సెప్టెంబర్ 25న పాన్ ఇండియా స్థాయిలో అఖండ 2ను విడుదల చేయబోతున్నట్టు మేకర్స్ అధికారికంగా వెల్లడించారు. అందుకు తగ్గట్టే పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ ను జెట్ స్పీడ్ లో కంప్లీట్ చేస్తున్నారు. గురువారంతో డబ్బింగ్ కూడా కంప్లీట్ అయింది. అయితే ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే.. బాలయ్య తెలుగుతో పాటు హిందీ వెర్షన్ డబ్బింగ్ సైతం తానే స్వయంగా చెప్పుకుంటున్నారట.
గత చిత్రం `భగవంత్ కేసరి`కి బాలయ్య హిందీలో డబ్బింగ్ చెప్పగా.. నార్త్ ఆడియన్స్ నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఇక ఈసారి కూడా తగ్గేదేలే అని నిర్ణయించుకున్న బాలయ్య.. అఖండ 2 హిందీ వర్షన్ డబ్బింగ్ చెప్పడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారట. ఆల్రెడీ తెలుగు డబ్బింగ్ కంప్లీట్ కాగా.. హిందీ డబ్బింగ్ స్టార్ట్ చేయనున్నట్టు తెలుస్తోంది.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు