అఖండ 2: ఎట్టకేలకు రిలీజ్ డేట్ చెప్పిన మేకర్స్..!

Divya
నందమూరి అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న అఖండ 2 తాండవం సినిమా సంబంధించి మేకర్స్ తాజాగా గుడ్ న్యూస్ తెలియజేశారు. ముందు నుంచి అనుకున్న ప్రకారమే డిసెంబర్ 12వ తేదీన ఈ సినిమాని రిలీజ్ చేయబోతున్నట్లు చిత్ర బృందం ప్రకటించారు. తాజాగా ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా ఒక సరికొత్త పోస్టర్ తో తెలియజేశారు. బోయపాటి శ్రీను, బాలకృష్ణ కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. వాస్తవంగా ఈ సినిమా డిసెంబర్ 5న పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ కావాల్సి ఉండగా ఫైనాన్స్ సమస్యల వల్ల చివరి నిమిషంలో ఈ సినిమా వాయిదా పడింది.



ఇప్పుడు ఫైనాన్షియల్ సమస్యలు తగ్గడంతో డిసెంబర్ 12న విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు.  డిసెంబర్ 11వ తేదీన ఈ సినిమాకి సంబంధించి ప్రీమియర్స్ పడబోతున్నట్లు తెలియజేశారు. అఖండ 2 సినిమాకు సంబంధించి ప్రతి ప్రమోషన్స్ లో కూడా బాలయ్య పాల్గొని మరింత బజ్ పెంచారు. ముఖ్యంగా సనాతన హైందవ ధర్మం బ్యాక్ డ్రాప్ లో వస్తున్న ఈ సినిమా మాస్ యాక్షన్ సినిమాగా రాబోతోంది. ఇందులో బాలయ్య నటన, డైలాగ్స్ కూడా హైలెట్ గా ఉండబోతున్నాయి. అలాగే ఇందులో అద్భుతమైన ఎమోషన్స్ సీన్స్ కూడా ఉండబోతున్నాయి. ముఖ్యంగా మదర్ సెంటిమెంట్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుందని వినిపిస్తోంది.


బాలకృష్ణ ఇందులో మూడు విభిన్నమైన గెటప్పులలో కనిపించబోతున్నట్లు సమాచారం. సంగీతాన్ని థమన్ అందిస్తున్నారు. ఇందులో సంయుక్త మీనన్ నటించగా ఆది పినిశెట్టి, హర్షాలి మల్హోత్రా , జగపతిబాబు, పూర్ణ తదితర నటీనటులు ఇందులో నటిస్తున్నారు. ఎట్టకేలకు బాలయ్య అభిమానులకు మాత్రం 14 రీల్స్ ప్లస్ సంస్థ గుడ్ న్యూస్ చెప్పడంతో కాస్త ఊపిరి పీల్చుకున్నారు. అఖండ 2 సినిమా 12న రిలీజ్ కావడం చేత ఈ వారంలో 14 కొత్త, 3 రీ రిలీజ్ సినిమాలు ప్రశ్నార్థకారంగా మారాయి.? ఇందులో కొన్ని సినిమాలు పోస్ట్ పోన్ అయినట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: