తల్లి మాటలు విని శ్రీలీల తప్పు చేస్తుందా.. ఇలాగైతే కెరీర్ నాశనమే!
తెలుగులో మాస్ మహారాజా రవితేజతో నటించిన `మాస్ జాతర` విడుదలకు సిద్ధం అవుతోంది. మరోవైపు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో `ఉస్తాద్ భగత్ సింగ్`, అక్కినేని అఖిల్ తో `లెనిన్` సినిమాలు శ్రీలీల లైనప్‌లో ఉన్నాయి. అయితే బాలీవుడ్, కోలీవుడ్ సినిమాల మోజులో పడి శ్రీలీల తెలుగు చిత్రాలకు సరిగ్గా డేట్స్ ఇవ్వడం లేదని ఇండస్ట్రీ వర్గాల్లో ప్రస్తుతం జోరుగా టాక్ నడుస్తోంది.
మొదటి నుంచి శ్రీలీల తల్లి చాటు బిడ్డ. స్క్రిప్ట్ సెలక్షన్ నుంచి డేట్స్ అడ్జస్ట్మెంట్ వరకు శ్రీలకు సంబంధించిన అన్ని విషయాలు ఆమె తల్లి దగ్గరుండి చూసుకుంటూ వస్తున్నారు. ఇక ఇప్పుడు కూడా తల్లినే తెలుగు సినిమాలను కాదని బాలీవుడ్ వైపు కుమార్తెను నడిపిస్తున్నట్టు టాలీవుడ్ నిర్మాతల నుంచి మాటలు వినిపిస్తున్నాయి. ఒకవేళ ఇదే నిజమైతే తల్లి మాటలు విని శ్రీలీల పెద్ద తప్పు చేస్తుందనే చెప్పుకోవచ్చు. తెలుగు చిత్రాలను కాలదన్ని బాలీవుడ్ ను ఏలేయాలని వెళ్లిన హీరోన్లంతా బొక్కబోర్లా పడ్డారు. ఇదే మిస్టేక్ శ్రీలీల కూడా చేస్తే కెరీర్ సర్వనాశనమే అని సినీ ప్రియులు అభిప్రాయపడుతున్నారు.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు