ఏఎన్నార్ కి బాగా నచ్చేసిన కథ మెగా హీరో చేతుల్లోకి.. నాగార్జున చేసిన మైండ్ బ్లోయింగ్ అద్భుతం ఇది..!

Thota Jaya Madhuri
ఏఎన్ఆర్ ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు . సినిమా ఇండస్ట్రీ ఇప్పుడు ఈ స్థాయిలో ఉంది అంటే దానికి ఏఎన్ఆర్ కూడా ఒక బిగ్ రీజన్ అని చెప్పాలి . అక్కినేని  నాగేశ్వరరావు గారి గురించి ఈ మధ్యకాలంలో చాలా వార్తలు ట్రెండ్ అవుతూ వచ్చాయి . మరీ ముఖ్యంగా నాగచైతన్య  - అఖిల్ పెళ్లిళ్లు చేసుకోవడం .. లైఫ్లో సెటిల్ అయిపోవడం బ్యాక్ టు బ్యాక్ నాగార్జున - నాగచైతన్య హిట్ కొట్టడం ..త్వరలోనే అఖిల్ "లెనిన్" సినిమాతో హిట్ కొట్టబోతున్నాడు అని రకరకాలుగా అక్కినేని ఫ్యామిలీకి సంబంధించిన పేర్లు వైరల్ అయ్యాయి.



 కదా ఇదే క్రమంలో అక్కినేని ఫ్యామిలీ మొత్తం కలిసి నటించిన "మనం" సినిమాకి సంబంధించిన వార్తలు బాగా ట్రెండ్ అవుతున్నాయి. మనకు తెలిసిందే సినిమా ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద స్టార్ ఫామ్లీగా పాపులారిటీ సంపాదించుకున్న అక్కినేని ఫ్యామిలీ మొత్తం కలిసి "మనం" అనే సినిమాలో నటించారు . నాగార్జున - అక్కినేని నాగేశ్వరరావు గారు- అఖిల్ - అమల - నాగచైతన్య అందరు కలిసి నటించారు . ఆశ్చర్యం ఏంటంటే .. సమంత ఇంటి కోడలు కాకపోయినా ఈ సినిమాలో కలిసి నటించేసింది . ఆ తర్వాత కోడలుగా అడుగు పెట్టింది . ఆ తర్వాత డివర్స్ తీసుకుంది.  అది వేరే మ్యాటర్ .



అయితే ఈ సినిమా కంటే ముందే అక్కినేని ఫ్యామిలీ మొత్తం మరొక సినిమాలో నటించాలనుకున్నారట . ఆ సినిమాని కృష్ణవంశీ డైరెక్ట్ చేసే విధంగా మాట్లాడుకున్నారట . నాగేశ్వరరావుకి కధ బాగా నచ్చిందట . నాగార్జున కూడా ఇంప్రెస్ అయ్యారట . ఇది మొత్తం ఒక ఎమోషనల్ కథ అంటూటాక్  బయటకు వచ్చింది . అయితే నాగార్జున అక్కినేని ఫ్యామిలీకి ఎంతో ఇష్టంగా గుర్తుండిపోయే ఈ సినిమా ఎమోషనల్ గా కాకుండా కథలో వైవిధ్యం ఉంటే ఇంకా బాగుంటుంది అంటూ కృష్ణవంశీ సినిమా స్టోరీ  ని రిజెక్ట్ చేశారట.  ఆ తర్వాత విక్రమ్ కుమార్ చెప్పిన పునర్జన్మల నేపథ్యంలో ని కథకు నాగార్జున ఇంప్రెస్ అయిపోయాడు . వెంటనే సెట్స్ పైకి సినిమా తీసుకొచ్చేశాడు. అక్కినేని అభిమానులకి గుర్తుండిపోయే మూవీ ఇది.



అయితే ఆ తర్వాత కృష్ణవంశీ అక్కినేని ఫ్యామిలీ కోసం రాసుకున్న కథను మెగా హీరోతో తెరకెక్కించాడు ఆ సినిమా మరేదో కాదు "గోవిందుడు అందరివాడేలే" ఈ సినిమాని నాగార్జున రిజెక్ట్ చేయడం మంచిదయింది. అలాంటి ఒక స్టోరీలో అక్కినేని హీరోస్ నటించి ఉంటే కచ్చితంగా అది ఫ్లాప్ అయి ఉండేది . మనం సినిమా చాలా చాలా బాగుంది . మనం సినిమా అందరికీ గుర్తుండిపోతుంది . నాగార్జున తీసుకున్న ఒక డెసిషన్ మనం సినిమా ఫైనలైజ్ అయ్యేలా చేసింది . అక్కినేని ఫ్యామిలీ పరువు కాపాడలే చేసింది అంటూ అప్పట్లో ఓ రేంజ్ లో నాగార్జున పనితీరును టాలెంట్ ని మెచ్చుకునేసారు అభిమానులు..!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: