నా మూవీ బాగుంది అని తెలిసే లేపే థియేటర్స్ నుండి తీసేస్తున్నారు.. ఎమోషనల్ అయిన నటుడు..?

Pulgam Srinivas
చాలా సంవత్సరాలు వెనక్కు వెళ్లినట్లయితే సినిమా ఇండస్ట్రీలో ఓ సినిమా విడుదల అయ్యి దానికి నెగటివ్ టాక్ వచ్చినా కూడా ఆ తర్వాత మెల్లి మెల్లిగా పుంజుకొని సినిమాలు అద్భుతమైన కలెక్షన్లను వసూలు చేసి బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ లుగా నిలిచిన సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ ప్రస్తుతం అలాంటి పరిస్థితులు లేవని చెప్పాలి. ఏదైనా సినిమా విడుదల అయింది అంటే దానికి మార్నింగ్ షో కు మంచి టాక్ వస్తేనే ఆ సినిమా పికప్ అయ్యి మంచి కలెక్షన్లను వసూలు చేసే అవకాశాలు ఉన్నాయి. ఇక చిన్న హీరోల సినిమాలకు మరి కఠిన పరిస్థితులు ఉన్నాయి.


వారి సినిమా విడుదల అయ్యి మంచి టాక్ ను తెచ్చుకున్న కూడా ఆ సినిమాలు అత్యంత తక్కువ సెంటర్లలో విడుదల కావడం వల్ల జనాలు కష్టపడి ఆ సినిమాలను చూడలేకపోవడం , అలాగే కొంతమందికి ఆ సినిమాలు చూడాలని ఉన్నా కూడా అంత కష్టపడి ఏం చూస్తాం ఓ టీ టీ లోకి వచ్చేస్తాయి అని లైట్ తీసుకుంటూ ఉండటంతో మంచి కంటెంట్ ఉన్న చిన్న సినిమాలు కూడా మంచి కలెక్షన్లను రాబట్టడం లేదు. ఇకపోతే తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు కలిగిన నటులలో నవీన్ చంద్ర ఒకరు. ఈయన ఈ మధ్య కాలంలో చాలా సినిమాల్లో హీరోగా నటిస్తున్నాడు. అలాగే విలన్ గా , ముఖ్య , కీలక పాత్రలలో నటిస్తున్నాడు. తాజాగా నవీన్ చంద్ర ఓ ఇంటర్వ్యూలో భాగంగా మాట్లాడుతూ ... ఈ మధ్య కాలంలో నేను హీరోగా నటించినా సినిమాలకు ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ లభిస్తుంది.


కానీ నా సినిమాలు తక్కువ సెంటర్లలో విడుదల అవుతున్నాయి. కానీ చాలా దూరం వెళ్లి కూడా నా సినిమాలను ప్రేక్షకులు చూస్తున్నారు. అది నాకు చాలా ఆనందాన్ని కలిగిస్తుంది. కానీ కొంత మంది కాస్త లేటుగా సినిమాను చూడాలి అనుకున్న వారికి ఆ లోపు నా సినిమా థియేటర్లలో ఉండడం లేదు అని చెబుతూ ఆయన చాలా ఎమోషనల్ అయ్యాడు. ఇకపోతే ప్రస్తుతం నవీన్ చంద్ర , రవితేజ హీరోగా రూపొందుతున్న మాస్ జాతర మూవీ లో విలన్ గా నటిస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: