ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న టాప్ హీరోయిన్స్ లో నయనతార ఒకటి. దాదాపు రెండు దశాబ్దాల నుంచి నటిగా రాణిస్తున్న నయనతార.. సౌత్ లో లేడీ సూపర్ స్టార్ గా గుర్తింపు పొందింది. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ చిత్రాలే కాకుండా ఇటీవల `జవాన్` మూవీతో బాలీవుడ్‌లోకి కూడా అడుగుపెట్టింది. అలాగే ఇండియాలో అత్యధిక పారితోషికం తీసుకునే నటిమణుల్లో ఒకరిగా చలామణి అవుతున్న నయనతార.. ఒక్కో చిత్రానికి రూ. 10 నుంచి 12 కోట్లు ఛార్జ్ చేస్తోంది అటువంటి నయన్ రూ. 100 కోట్లు ఇస్తామని హామీ ఇచ్చినప్పటికీ.. ఓ హీరోతో వచ్చిన నటించనని చెప్పిందట. ఇంతకీ నయనతార రిజెక్ట్ చేసిన నటుడు మరెవరో కాదు శరవణ స్టోర్స్ ఓవనర్ అరుళ్ శరవణన్.
శరవణ స్టోర్స్.. తమిళనాడులో ఈ పేరు వినని వారు ఉండరు. జ్యువెలరీ, టెక్స్టైల్స్, ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ ఇలా శరవణ స్టోర్స్ లో దొరకందంటూ ఉండదు. అటువంటి స్టోర్స్ కు అధిపతి అయిన అరుళ్ శరవణన్ 51 ఏళ్ల వయసులో `ది లెజెండ్` మూవీతో హీరోగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చారు. బాలీవుడ్ నటి ఊర్వశి రౌతేలా ఇందులో హీరోయిన్. భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ మూవీ 2022లో విడుదలైన డిజాస్టర్ గా నిలిచింది.
అయితే శరవణన్ మరో సినిమాను ప్లాన్ చేస్తున్నాడు. అందులో హీరోయిన్ క్యారెక్టర్ కోసం ఇటీవల నయనతారను సంప్రదించారట. ఎంత డబ్బు అడిగినా, రూ.100 కోట్లు అయినా ఇస్తానని చెప్పారట. కానీ నయన్ మాత్రం ఆ ఆఫర్ ను ఎటమ కాలితో తన్నిందట. ఎంత డబ్బు ఇచ్చినా అతనితో కలిసి వర్క్ చేయనని స్పష్టంగా చెప్పేసిందట. ఇందుకు కారణం లేకపోలేదు.. బలమైన కథలు, మంచి దర్శకులు ఉన్న సినిమాలనే నయన్ ఎంచుకుంటుంది. అందుకే శరవణన్ దగ్గర డబ్బు ఉన్నప్పటికీ, ఆ ప్రాజెక్ట్ తనకు సరైనదని కాదని భావించి ఆమె నో చెప్పిందట.