మలయాళ సూపర్ హిట్ `ప్రేమమ్` మూవీ తో అరంగేట్రం చేసిన కేరళ కుట్టి అనుపమ పరమేశ్వరన్.. `అ ఆ` తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ఇందులో సెకండ్ హీరోయిన్ అయినప్పటికీ.. ఆడియన్స్ కు విపరీతంగా కనెక్ట్ అయింది. ఆ తర్వాత `శతమానంభవతి` సినిమాతో మరింత క్రేజ్ సంపాదించుకుంది.
కేవలం ఒక్క భాషకు పరిమితం కాకుండా తెలుగుతో తమిళ్, కన్నడ, మలయాళంలోనూ వరుసగా సినిమాలు చేస్తూ ఈ అమ్మడు బిజీ షెడ్యూల్ ను మెయింటైన్ చేస్తుంది. ప్రస్తుతం అనుపమ చేతిలో దాదాపు అర డజన్ ప్రాజెక్టులు ఉన్నాయి. తెలుగులో ప్రవీణ్ కండ్రేగుల దర్శకత్వంలో `పరదా` అనే సినిమాలో అనుపమ మెయిన్ లీడ్ గా యాక్ట్ చేస్తుంది.
అలాగే మలయాళం లో `జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ`, `పెట్ డిటెక్టివ్` వంటి చిత్రాల్లో నటిస్తోంది. మరోవైపు తమిళంలో ధృవ్ విక్రమ్ తో కలిసి `బైసన్` అనే స్పోర్ట్స్ డ్రామా చేస్తోంది. `లాక్‌డౌన్` అనే మరో తమిళ చిత్రం కూడా అనుపమ చేతిలో ఉంది. ఇకపోతే సోషల్ మీడియాలో సూపర్ యాక్టివ్ గా ఉండే అనుపమ పరమేశ్వరన్.. తాజాగా ట్రెడిషనల్ లుక్ లో దిగిన కొన్ని ఫోటోలు పంచుకుంది.
ఈ పిక్స్ లో డిఫరెంట్ చీర కట్లు, ఒంటి నిండా బంగారు ఆభరణాలతో అచ్చం పెళ్లి కూతురులా మెరిసిపోయింది. కర్రీ హెయిర్ ఆమె అందాన్ని మరింత పెంచేసింది. అనుపమ లేటెస్ట్ ఫోటోలు చూసి అభిమానులు, నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు, ట్రెడిషనల్ లుక్ లో అనుపమ ఇంత అందంగా ఉందేంట్రా బాబు అంటూ చర్చించుకుంటున్నారు.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు