కోలీవుడ్ లెజెండరీ డైరెక్టర్, ఎవర్ గ్రీన్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ మణిరత్నం దర్శకత్వంలో వర్క్ చేయాలని టాప్ స్టార్స్ కూడా ఆశ పడుతుంటారు. అటువంటి అద్భుత అవకాశం టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో నవీన్ పోలిశెట్టికి దక్కినట్టు గత వారం రోజులు నుంచి సోషల్ మీడియాలో వార్తలు చెక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. యూత్ ను ఆకట్టుకునే విధంగా ఒక అద్భుతమైన లవ్ స్టోరీని తీసేందుకు మణిరత్నం ప్లాన్ చేస్తున్నారని.. ఆ చిత్రంలో నవీన్ పోలిశెట్టి హీరోగా నటించనున్నాడని కథనాలు వెలువడ్డాయి.
అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ తెరపైకి వచ్చింది. యూత్ ఫుల్ లవ్ ఎంటర్టైనర్ గా తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో రూపుదిద్దుకోనున్న ఈ చిత్రంలో నవీన్ పోలిశెట్టి కి జోడిగా కన్నడ క్రేజీ బ్యూటీ రుక్మిణి వసంత్ ను తీసుకునే యోచనలో మణిరత్నం ఉన్నారట. ఆల్మోస్ట్ ఆమె ఎంపిక ఖరారు అయినట్లే అని ప్రచారం జరుగుతుంది. దీంతో `వాటే కాంబినేషన్.. బొమ్మ బ్లాక్ బస్టర్` అంటూ సినీ ప్రియులు అభిప్రాయపడుతున్నారు.
కాగా, మణిరత్నం ఇప్పుడు `థగ్ లైఫ్` ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు. దాదాపు మూడున్నర దశాబ్దాల తర్వాత కమల్ హాసన్ తో జతకట్టి మణిరత్నం తెరకెక్కించిన ఈ చిత్రం జూన్ 5న గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. నవీన్ పోలిశెట్టి విషయానికి వస్తే.. ఈయన గత చిత్రం `మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి` సూపర్ హిట్ గా నిలిచింది. ఆ తర్వాత ఒక యాక్సిడెంట్ కారణంగా సినిమాలకు బ్రేక్ ఇచ్చిన నవీన్ పోలిశెట్టి.. ఇటీవల పెండింగ్లో ఉన్న సినిమాలను పూర్తి చేసే పనిలో పడ్డాడు. ఇక `సప్త సాగరాలు దాటి` చిత్రంతో ఓవర్ నైట్ స్టార్ గా గుర్తింపు పొందిన రుక్మిణి వసంత్ తాజాగా `ఏస్` మూవీతో ప్రేక్షకులను పలకరించింది. ప్రస్తుతం ఈ సుందరి కోసం ఎన్టీఆర్, ప్రభాస్, శివ కార్తికేయన్ వంటి హీరోలు క్యూ కట్టి ఉన్నారు.