జాను రిలి.. ప్రస్తుతం వార్తల్లో హాట్ టాపిక్ గా మారిన పేరు. ఫోక్ డ్యాన్సర్ గా కెరీర్ ప్రారంభించిన జాను లిరి తన డ్యాన్స్ తో ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. కరీంనగర్ జిల్లాలోని గోదావరిఖని ప్రాంతానికి చెందిన జాను మధ్య తరగతి కుటుంబంలో జన్మించింది. డ్యాన్స్ పై ఉన్న ఆసక్తితో ఓ డ్యాన్స్ మాస్టర్ వద్ద చిన్నప్పటి నుండి డ్యాన్స్ నేర్చుకుంది. అప్పట్లో రాజకీయ సభల్లోనూ ఫోక్ డ్యాన్స్ లు చేస్తూ జాను ఆకట్టుకునేది. ఈ క్రమంలోనే టోని కిక్ అనే మరో డ్యాన్సర్ ను జాను ప్రేమ వివాహం చేసుకుంది. బెల్లంపల్లికి చెందిన టోనీని ప్రేమ వివాహం చేసుకున్న తరవాత వీరిద్దరూ కలిసి కూడా ఫోక్ పాటలకు డ్యాన్స్ చేసేవారు.
వీరికి ఓ కుమారుడు కూడా ఉన్నాడు. ఇద్దరి మధ్య మనస్పర్దలు రావడంతో జాను తన భర్త టోనితో విడాకులు తీసుకుంది. ఆ తరవాత కూడా జాను ఫోక్ సాంగ్స్ చేయడం ప్రారంభింది. మరోవైపు టోని కూడా ఫోక్ సాంగ్స్ తో చాలా మంది ఫ్యాన్స్ ను సంపాదించుకున్నాడు. ప్రస్తుతం టీవీ షోలు సైతం చేస్తున్నాడు. ఇక జాను అయితే ఫోక్ సాంగ్స్ తో అదరగొట్టడంతో పాటూ బుల్లితెరపై ఢీ డ్యాన్స్ షో ద్వారా టీవీ ప్రేక్షకులకు సైతం దగ్గరైంది. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ జాను పాటలకు ఆమె స్టెప్పులకు అభిమానులు ఉన్నారు. ఢీ షోలో జాను డ్యాన్స్ చేసిందంటే ఆ వీడియోకు మిలియన్స్ కొద్ది వ్యూవ్స్ రావాల్సిందే.
అదే జోష్ తో ఢీ టైటిల్ సైతం గెలుచుకుంది. ఇక కొన్నేళ్లుగా ఒంటరిగా తన కొడుకుతో ఉంటున్న జాను లిరి దిలీప్ అనే ఫోక్ సింగర్ తో ప్రేమలో పడింది. జాను చేసిన అనేక పాటలను దిలీప్ పాడారు. ఈ క్రమంలో ప్రేమలో పడటంతో ఇద్దరూ పెళ్లి చేసుకుంటున్నట్టు అఫీషియల్ గా ప్రకటించారు. దీంతో జాను పై ట్రోల్స్ మొదలయ్యాయి. తన కొడుకు కోసం పెళ్లి చేసుకోను అని గతంలో చెప్పిందని ఇప్పుడు మళ్లీ చేసుకుంటుందని నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. మరి కొందరు జాను జీవితం ఆమె ఇష్టం, తనకు నచ్చినట్టు బతికే హక్కు ఉంది కాబట్టి ఆమెను వదిలేయాలని ట్రోల్స్ చేయడం తప్పు అని భావిస్తున్నారు. ఇక ఇలాంటి పరిస్థితులు మధ్య రెండో పెళ్లి చేసుకుంటున్న జాను కొత్త జీవితం ఎలా ఉంటుందో చూడాలి.