
నేను వాళ్లను జడ్జ్ చేయను.. పూరీతో సినిమాపై విజయ్ సేతుపతి కామెంట్స్ వైరల్!
పూరీ జగన్నాథ్ తో నేను చేయబోయే సినిమా జూన్ నెలలో ప్రారంభం ఆవుతుందని విజయ్ సేతుపతి తెలిపారు. గతంలో వాళ్లు చేసిన సినిమాల ఫలితాల ఆధారంగా డైరెక్టర్లను జడ్జ్ చేయనని ఆయన వెల్లడించారు. స్క్రిప్ట్ నచ్చితే మాత్రమే సినిమా చేస్తానని పూరీ జగన్నాథ్ చెప్పిన కథ నాకు చాలా నచ్చిందని అందుకే ఈ సినిమాకు నేను గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగిందని విజయ్ సేతుపతి పేర్కొన్నారు.
ఇలాంటి కథను నేను ఇప్పటివరకు చేయలేదని నేను ఎప్పుడూ కొత్తవాటికి ప్రాధాన్యత ఇస్తానని ఆయన తెలిపారు. గతంలో చేసిన స్టోరీలు సైతం రిపీట్ కాకుండా చూసుకుంటానని విజయ్ సేతుపతి చెప్పుకొచ్చారు. నా సినిమాలలో మహారాజ సినిమా చాలా స్పెషల్ అని ఆ సినిమాలోని పాత్ర చాలా కష్టమైనదని విజయ్ సేతుపతి కామెంట్లు చేశారు. పిల్లలపై జరుగుతున్న అన్యాయాలకు సంబంధించి ఈ సినిమాలో కొన్ని ఉన్నాయని ఆయన తెలిపారు.
సూపర్ డీలక్స్, ఉప్పెన సినిమాలలోని పాత్రలు కూడా కష్టమైనవేనని విజయ్ సేతుపతి వెల్లడించారు. అయితే మహారాజ సినిమా నా హృదయాన్ని హత్తుకుందని ఎందుకంటే రియల్ లైఫ్ లో నేను కూడా తండ్రినేనని ఆయన తెలిపారు. విజయ్ సేతుపతి నెక్స్ట్ లెవెల్ ప్రాజెక్ట్ లను ఎంచుకుంటే మరిన్ని రికార్డులను క్రియేట్ చేసే ఛాన్స్ అయితే కచ్చితంగా ఉంటుందని చెప్పవచ్చు. పూరీ జగన్నాథ్ భవిష్యత్తు ప్రణాళికలు ఏ విధంగా ఉండబోతున్నాయో చూడాల్సి ఉంది.