మలయాళ సినిమా ఇండస్ట్రీ క్రేజ్ రోజు రోజుకు పెరిగిపోతున్న విషయం మన అందరికీ తెలిసిందే. మలయాళ ఫిలిం మేకర్స్ తక్కువ ఖర్చుతో చిన్న పాయింట్ తో సినిమాలను తెరకెక్కించడంలో అద్భుతంగా సక్సెస్ అవుతున్నారు. ఈ ఇండస్ట్రీ వారు ఈ మధ్య కాలంలో తెరకెక్కించిన అనేక తక్కువ బడ్జెట్ సినిమాలు అద్భుతమైన విజయాలను బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. ఇకపోతే తాజాగా మలయాళంలో ఆఫీసర్ ఆన్ డ్యూటీ అనే సినిమా వచ్చిన విషయం మనకు తెలిసిందే.
మంచి అంచనాల నడుమ ఫిబ్రవరి 20 వ తేదీన మలయాళ భాషలో విడుదల అయిన ఈ సినిమాకి మలయాళ ప్రేక్షకుల నుండి బ్లాక్ బస్టర్ టాక్ వచ్చింది. దానితో ఈ మూవీ సూపర్ సాలిడ్ కలెక్షన్లను వసూలు చేసి మలయాళ బాక్సా ఫీస్ దగ్గర మంచి విజయాన్ని సాధించింది. ఇలా మలయాళ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం సాధించడంతో ఈ సినిమాను ఫిబ్రవరి 14 వ తేదీన తెలుగు భాషలో ఆఫీసర్ ఆన్ డ్యూటీ అనే టైటిల్ తోనే విడుదల చేశారు. ఇకపోతే ఈ సినిమాను మార్చి 14 వ తేదీన తెలుగు భాషలో విడుదల చేస్తే ఈ మూవీ ఓ టి టి విడుదలకు సంబంధించిన అధికారిక ప్రకటన మార్చి 15 వ తేదీన వచ్చేసింది.
ఈ మూవీ యొక్క ఓ టి టి హక్కులను నెట్ ఫ్లిక్స్ సంస్థ వారు దక్కించుకున్నారు. అందులో భాగంగా తాజాగా ఈ సంస్థ వారు ఆఫీసర్ ఆన్ డ్యూటీ సినిమా యొక్క మలయాళ వెర్షన్ తో పాటు తమిళ్ , తెలుగు , కన్నడ , హిందీ వెర్షన్ లను కూడా మార్చి 20 వ తేదీ నుండి నెట్ ఫ్లిక్స్ ఓ టి టి ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ చేయనున్నట్లు ఈ సంస్థ వారు అధికారికంగా ప్రకటించారు.