పాకిస్తానీ హీరోయిన్ ని పెళ్లి చేసుకోబోతున్న సల్మాన్ ఖాన్.?
రాఖీసావంత్ మాట్లాడుతూ.. సల్మాన్ ఖాన్ పెళ్లి చేసుకుంటే బాగుంటుందని నేను భావిస్తున్నాను. అలాగే పాకిస్తానీ నటి హనియా అమీర్ నా కోడలు.. హనియా అమీర్,సల్మాన్ ఖాన్ ల కాంబోలో సినిమా వస్తే బాగుంటుందని నా అభిప్రాయం. రియల్ లైఫ్ లో సల్మాన్ ఖాన్ హనియా అమీర్ ఇద్దరూ కలిసి ఉండడం చూస్తే బాగుంటుంది. సల్మాన్ ఖాన్ ఓ ఇంటివాడు కావాలని నేను కోరుకుంటున్నాను.అయితే రాఖీ సావంత్ చెప్పిన హనియా అమీర్ ఇండియన్ నటి కాదు. ఆమె పాకిస్తానీ నటి.. అలాంటి హీరోయిన్ తో సల్మాన్ ఖాన్ పెళ్లి కావాలని కోరుకుంటున్నాను అంటూ మాట్లాడడం చాలామంది సల్మాన్ అభిమానులని హట్ చేసింది.
దాంతో రాఖీసావంత్ పై నెగిటివ్ కామెంట్ చేస్తున్నారు. అంతేకాదు హానియా అమీర్ సల్మాన్ ఖాన్ ఇద్దరినీ కలిపి ఓ వీడియో షేర్ చేయడమే కాకుండా ఇండియన్ పాక్ క్రికెటర్లు వేసుకునే జెర్సీ లు వేసుకొని రాఖీసావంత్ కనిపించింది. అలాగే పాకిస్తానీ నటి హనియా అమీర్ త్వరలోనే బీటౌన్ లోకి కూడా వస్తుందని రాఖీసావంత్ జోస్యం చెప్పింది. దీంతో ఇది నిజమేనా అని చాలామంది భావిస్తున్నారు. అంతే కాదు సల్మాన్ తో పెళ్లి గురించి హనీయా అమీర్ ని పర్సనల్గా కలిసి మాట్లాడతానని రాఖీసావంత్ చెప్పడం ప్రస్తుతం మీడియాలో వైరల్ గా మారింది. ఇక సల్మాన్ ఖాన్ ప్రస్తుతం రష్మిక మందన్నాతో సికిందర్ మూవీలో చేస్తున్నారు.