
అనిల్ రావిపూడి - మెగాస్టార్ సినిమాలో ఈ పెద్ద ట్విస్ట్ చూశారా..!
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం మల్లిడి వశిష్ట దర్శకత్వం లో విశ్వంభర అనే సోషియో ఫాంటసీ సినిమా లో నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా సంక్రాంతికి రిలీజ్ కావాల్సి ఉంది. అయితే షూటింగ్ లేట్ అవ్వడం తో సమ్మర్ కానుకగా మే రెండో వారం లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ అయితే చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమా పూర్తయిన వెంటనే చిరు తన కొత్త సినిమా గురించి ఇప్పటికే అప్ డేట్ ఇచ్చారు. తాను అనిల్ రావిపూడి దర్శకత్వంలో తాను ఓ ఫుల్ కామెడీ ఎంటర్ టైనర్ లో నటించబోతున్నట్లు చిరు క్లారిటీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ వచ్చే వేసవి నుంచి ఉంటుంది.
ఇంకా ఈ క్రేజీ ప్రాజెక్టు పై చిరు మాట్లాడుతూ ఈ ప్రాజెక్టు కంప్లీట్ వినోదాత్మక సినిమా అని .. ఆ మూవీ ని సెట్స్ మీద ఎప్పుడు తీసుకు వెళతారు ? తాను ఎప్పుడు సెట్స్ లోకి వెళతానని ఎంతో ఆసక్తి తో ఉన్నానని చెప్పారు. అయితే ఈ సినిమా నుంచి ఓ అదిరిపోయే ట్విస్ట్ ఒకటి బయటకు వచ్చింది. ఈ క్రేజీ ప్రాజెక్టు లో మెగాస్టార్ చిరంజీవి ద్విపాత్రాభినయం చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇక అనిల్ రావిపూడి సినిమా లో సీన్ల గురించి చెపుతుంటూనే తాను కడుపుబ్బా నవ్వేశానని .. గతంలో దర్శకుడు కోదండ రామిరెడ్డితో పని చేసిన సమయంలో ఎలాంటి ఫీలింగ్ ఉందో.. ఇప్పుడు అనిల్‌తో అలాంటి ఫీలింగే ఉందని .. సినిమా ఖచ్చితంగా ఫ్యాన్స్ కు బాగా నచ్చుతుందని చిరు తెలిపారు.
ఇక ఈ క్రేజీ ప్రాజెక్టు ను షైన్ స్క్రీన్స్ బ్యానర్ అధినేత సాహు గారపాటి, సుస్మిత (చిరంజీవి కుమార్తె) సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తారని చిరు తెలిపారు.