తెలుగు ఇండస్ట్రీలో అక్కినేని ఫ్యామిలీ అంటేనే ఒక తెరిచిన పుస్తకం లాంటిది.. ఈ పుస్తకానికి మూలాధారం ఏఎన్ఆర్ అని చెప్పవచ్చు. ఆయన ఈ ఫ్యామిలీని ఇంతటి స్థాయికి రావడానికి ఎంతో కృషి చేశారు. కేవలం తాను ఎదగడమే కాకుండా ఇండస్ట్రీ కూడా ఎదిగేలా చేశారని చెప్పవచ్చు. అలాంటి అక్కినేని నాగేశ్వరరావు నట వారసుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు నాగార్జున.. అలాంటి నాగర్జున తన కెరియర్ మంచి పొజిషన్ లో ఉండగానే దగ్గుబాటి ఫ్యామిలీకి చెందినటువంటి లక్ష్మీని పెళ్లి చేసుకున్నారు. వీరికి నాగచైతన్య పుట్టిన తర్వాత వీరి మధ్య వచ్చిన గొడవల వల్ల విడాకులు తీసుకున్నారు. అదే సమయంలో ఇండస్ట్రీలోకి కొత్తగా ఎంట్రీ ఇచ్చిన అమలతో ప్రేమలో పడి ఆరు సంవత్సరాల తర్వాత ప్రపోజ్ చేశాడు.
చివరికి అమల కూడా ఒప్పుకోవడంతో వీరి పెళ్లికి లైన్ క్లియర్ అయింది. కానీ అక్కడే అసలు ట్విస్ట్ మొదలైంది. అమలతో పెళ్లికి అక్కినేని నాగేశ్వరరావు అస్సలు ఒప్పుకోలేదు.. సినిమా ఇండస్ట్రీకి చెందిన వారిని పెళ్లి చేసుకోవడం వద్దంటే వద్దని ఆయన అన్నారట. కానీ చివరికి నాగర్జున ఎలా గోల ఒప్పించి పెళ్లి చేసుకొని అఖిల్ కు జన్మనిచ్చారు.. అప్పటినుంచి వీరి సంసారంలో ఎలాంటి కలతలు రాలేదు.. అలా హ్యాపీగా జీవిస్తున్న తరుణంలో అమలతో తరచూ గొడవలు వస్తాయని నాగార్జున ఒక సందర్భంలో చెప్పారు..
అమల ప్రపంచంలో ఉన్న బారానంత తానే మోస్తుందని ఫీల్ అవుతుంది.. ఎక్కడ జంతువులను చంపినా, చెట్లను కొట్టిన ఆమె చాలా వరకు రియాక్ట్ అవుతుంది.. దాన్నంతా ఇంటికి తీసుకొచ్చి నాపై పెడుతుంది.. ఆమెకి ఒక్క పని తప్ప ఇంకో పని రాదు.. షూటింగ్ చేసి టైడ్ అయిపోయి ఇంటికి వస్తే నేను సేవా కార్యక్రమాలకు ఢిల్లీ వెళ్తున్న వరంగల్ వెళుతున్న అంటూ చెక్కేస్తుంది.. ఆమె చేసే పనిలో ఎంతో నిబద్ధత ఉన్న ఆమెతో పని విషయంలోనే చాలా గొడవలు వస్తూ ఉంటాయి అంటూ నాగార్జున తెలియజేశారు. ప్రస్తుతం ఆయన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.