రజినీతో సిల్క్‌స్మిత ఎఫైర్‌...ఇద్దరూ ఒకే రూంలో దొరికారా ?

frame రజినీతో సిల్క్‌స్మిత ఎఫైర్‌...ఇద్దరూ ఒకే రూంలో దొరికారా ?

Veldandi Saikiran
అలనాటి నటి సిల్క్ స్మిత గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ బ్యూటీ తనదైన నటన, అందంతో ఎంతగానో అభిమానులను ఆకట్టుకుంది. సిల్క్ స్మిత ఏ సినిమాలో నటించిన కూడా దాదాపు ఆ సినిమాలన్నీ సూపర్ హిట్ అందుకునేవి. సిల్క్ స్మిత దాదాపు 300కి పైగా సినిమాల్లో నటించి తన హవాను కొనసాగించింది. ఒకానొక సమయంలో టాలీవుడ్ ఇండస్ట్రీని తన నటనతో ఆకట్టుకుందని చెప్పవచ్చు.


తన నటన, అందంతో భారీగా డబ్బులను సంపాదించింది. అదే స్థాయిలో గుర్తింపును కూడా అందుకుంది. కానీ సిల్క్ స్మిత చనిపోయే సమయంలో చాలా బాధను, నరకాన్ని అనుభవించి కన్ను మూసింది. చిన్నతనం నుంచి కుటుంబంలో అనేక విధాల ఆర్థిక సమస్యలతో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంది. చదువుకోవాలని కోరిక ఉన్నప్పటికీ తన చదువును మానేసింది. సిల్క్ స్మితకు అతి చిన్న వయసులోనే వివాహం చేశారు.


వివాహం అనంతరం సిల్క్ స్మిత జీవితం అంధకారంలో పడింది. తన అత్తింటి నుంచి ఎప్పుడు వేధింపులు ఉండేవి. తన భర్త, అత్తమామలు ఎప్పుడు వేధిస్తూ ఉండేవారు. వారి వేధింపులను తట్టుకోలేక సిల్క్ స్మిత ఇంట్లో నుంచి పారిపోయి నటిగా పరిచయమైంది. ఎలా అయినా డబ్బులను సంపాదించాలనే ఉద్దేశంతో సినీ ప్రపంచంలోకి అడుగుపెట్టింది. భారీగా డబ్బులను సంపాదించుకుంది. కానీ మరణించే సమయంలో ఎంతో బాధను అనుభవించింది. సిల్క్ స్మిత మరణానికి ఎంతో మంది కారణమంటూ అనేక రకాలుగా వార్తలు వచ్చాయి.

సిల్క్ స్మిత మరణించడానికి సినీ సెలబ్రిటీలు కూడా కారణమని సమాచారం. అందులో నటుడు రజనీకాంత్ పేరు కూడా ఉండడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. సిల్క్ స్మిత సినిమాలో రాణిస్తున్న సమయంలో నటుడు రజినీకాంత్ కి, సిల్క్ స్మితకు మధ్య ప్రేమాయణం నడిచిందట. రజనీకాంత్ నటించిన అన్ని సినిమాలలో సిల్క్ స్మిత తప్పకుండా ఉండేది. అయితే వీరిద్దరి మధ్య రిలేషన్ కొనసాగినట్లు ఎన్నో రకాల వార్తలు రూమర్స్ వచ్చాయి. అయితే ఈ విషయంలో ఎంతవరకు వాస్తవం ఉందో తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: