
సంక్రాంతికి వస్తున్నాం మూవీ సీక్వెల్ రిలీజ్ అప్పుడేనా.. వెంకీ మామ క్లారిటీ ఇచ్చేశారుగా!
సంక్రాంతికి వస్తున్నాం మూవీ శాటిలైట్, డిజిటల్ హక్కులు జీ గ్రూప్ సొంతం చేసుకోవడంతో ఈ విధంగా చేయడం సాధ్యమవుతుంది. సంక్రాంతికి వస్తున్నాం మూవీకి సీక్వెల్ కూడా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. అయితే సంక్రాంతికి వస్తున్నాం మూవీ సీక్వెల్ గురించి వెంకటేశ్ క్లారిటీ ఇవ్వగా ఈ హీరో చెప్పిన విషయాలు వైరల్ అవుతున్నాయి.
2027 సంవత్సరంలో సంక్రాంతికి వస్తున్నాం మూవీ సీక్వెల్ రిలీజయ్యే ఛాన్స్ ఉందని వెంకటేశ్ తన కామెంట్ల ద్వారా పరోక్షంగా చెప్పుకొచ్చారు. మంచి ఫ్యామిలీ మూవీ వస్తే సక్సెస్ అందించాలని ప్రేక్షకులు కోరుకున్నారని వెంకటేశ్ తెలిపారు. సినీ ప్రేమికులు, పరిశ్రమకు కృతజ్ఞతలు అని ఆయన కామెంట్లు చేశారు. రాఘవేంద్ర రావు గారు మంచి ఫ్యామిలీ మూవీ వస్తే కచ్చితంగా హిట్టవుతుందని గత కొంతకాలంగా చెబుతూ ఉండేవారని వెంకటేశ్ చెప్పుకొచ్చారు.
సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో ఆయన అంచనా నిజమైందని వెంకటేశ్ కామెంట్లు చేశారు. నా ఫ్యాన్స్, కుటుంబ ప్రేక్షకులు సినిమాను పెద్ద స్థాయికి తీసుకెళ్లారని వెంకటేశ్ చెప్పుకొచ్చారు. మూతబడిన థియేటర్లను సైతం సంక్రాంతికి వస్తున్నాం మూవీ కళకలలాడించిందని వెంకటేశ్ అన్నారు. 2027 సంవత్సరంలో మళ్లీ సంక్రాంతికి వస్తామని రికార్డ్స్ కొట్టడానికి కాదని ప్రేక్షకులకు వినోదాన్ని పంచడమే ముఖ్యమని వెంకీ మామ కామెంట్లు చేశారు. సీనియర్ హీరోలలో విక్టరీ వెంకటేశ్ కలెక్షన్ల విషయంలో టాప్ లో ఉండటం గమనార్హం. గతేడాది హనుమాన్ మూవీ హిట్ గా నిలవగా ఈ ఏడాది సంక్రాంతికి వస్తున్నాం మూవీ సత్తా చాటింది.