
ఆ స్టార్ హీరో సినిమాకు జీరో బజ్... జీరో ఓపెనింగ్స్ ..!
టాలీవుడ్ లో సంక్రాంతి సీజన్ తర్వాత మళ్ళీ తెలుగు సహా తమిళ సినిమా దగ్గర మంచి బజ్ తో సినిమాలు రిలీజ్ కాలేదు. అయితే ఫిబ్రవరి లో పరీక్షల సీజన్ మదలు కానుండం తో మంచి సినిమా లు వస్తాయా ? రావా ? అన్న సందేహాల మధ్య కొన్ని పెద్ద సినిమా లు రిలీజ్ కు రెడీ అవుతున్నాయి. ఇటు తెలుగు తో పాటు అటు తమిళం నుంచి కొన్ని అంచనా లు ఉన్న సినిమాలు రిలీజ్ కానున్నాయి.
ఈ ఫిబ్రవరిలో మాత్రం పలు ప్రముఖ సినిమాలు తెలుగు స్టేట్స్ లో సందడి చేసేందుకు సిద్దంగా ఉన్నాయి. అయితే ఈ సినిమా ల్లో అక్కినేని హీరో నాగ చైతన్య నటించిన తండేల్ సినిమా ఒకటి కాగా ... తమిళ్ నుంచి స్టార్ హీరో అజిత్ కుమార్ నటించిన అవైటెడ్ సినిమా “ పట్టుదల ” కూడా ఉంది. ఇది తమిళ్ లో విదామయూర్చి పేరు తో రిలీజ్ అవుతోంది. అయితే ఈ రెండు సినిమా లలో అజిత్ సినిమాకి మాత్రం తెలుగులో జీరో బజ్ తోనే వస్తుంది అని చెప్పాలి. మేకర్స్ లాస్ట్ మినిట్ లో తెలుగు వెర్షన్ రిలీజ్ ఎనౌన్స్ చేశారు. అయితే ఈ సినిమా మినిమమ్ ప్రమోషన్స్ కూడా తెలుగులో చేసుకోలేక పోవడంతో అసలు తెలుగు లో ఏ మాత్రం అంచనాలు లేవు.
దీంతో అజిత్ లాంటి స్టార్ హీరో సినిమా ఈ రోజు రిలీజ్ అవుతుంది అని కూడా చాలా మందికి తెలియని దుస్థితి. అసలు ఈ సినిమాకు మినిమం అడ్వాన్స్ బుకింగ్స్ కూడా జరగడం లేదు. మరి లాస్ట్ టైం తెగింపు సినిమాకి కూడా ఇదే పరిస్థితి. మరి ఈ సినిమాకి ఎలాంటి ఓపెనింగ్స్ తెలుగులో వస్తాయో చూడాలి.