
అతనితో హీరోయిన్ సమంత డేటింగ్ ?
ఓ ప్రముఖ దర్శకుడితో సమంత డేటింగ్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. గత కొన్ని రోజులుగా ఈ తతంగం జరుగుతోందట. దర్శకుడు రాజు నిడిమోర్ తో హీరోయిన్ సమంత ప్రేమలో పడ్డట్లు సోషల్ మీడియాలో వార్తలు నడుస్తున్నాయి. తాజాగా పికిల్ బాల్ టోర్నమెంట్ లో చెన్నై జట్టు యజమానిగా ఉన్న సమంత... ఆ టోర్నమెంట్ ఆరంభంలో రాజుతో కలిసి చాలా ఎంజాయ్ గా కనిపించారు.
అయితే దీనిపై ఇప్పటివరకు సమంతా లేదా రాజు కానీ స్పందించలేదు. దీనిపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది. ఇది ఇలా ఉండగా అక్కినేని నాగచైతన్యకు విడాకులు ఇచ్చిన తర్వాత.... సమంత సింగిల్ గానే ఉంటున్నారు. కానీ అక్కినేని నాగచైతన్య మాత్రం హీరోయిన్ శోభితను రెండవ పెళ్లి చేసుకున్నాడు. దాదాపు మూడు సంవత్సరాల పాటు సింగిల్ గా ఉన్న అక్కినేని నాగచైతన్య.... చివరికి శోభితను పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. ఇంత జరుగుతున్నా కూడా సమంత మాత్రం... సింగిల్ గానే ఉంటూ సినిమాలు చేసుకుంటుంది. అలాగే పలు వ్యాపారాలలో పెట్టుబడులు కూడా పెడుతుంది హీరోయిన్ సమంత. ఇలాంటి తరుణంలోని దర్శకుడు రాజతో కలిసి కనిపించడం... హాట్ టాపిక్ అయింది.