
దిల్ రాజు, ప్రశాంత్ కాంబోలో మూవీ..హీరో అతనే ?
కానీ అందులో సంక్రాంతికి వస్తున్నాం సినిమా మంచి సక్సెస్ అందుకోగా..... గేమ్ చేంజర్ సినిమా మాత్రం యావరేజ్ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమా వల్ల నిర్మాత దిల్ రాజు భారీగా నష్టపోయారని తెలుస్తోంది. ఈ సినిమాలో రామ్ చరణ్ హీరోగా చెయ్యగా, కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా వల్ల దిల్ రాజు భారీగా నష్టపోయారని తెలియడంతో మెగా హీరో రామ్ చరణ్ ఓ సంచలన నిర్ణయం తీసుకున్నాడు.
తనతో మరో సినిమాను చేస్తానని ఒప్పుకున్నారు. అంతేకాకుండా తనకు ఎప్పుడు సపోర్ట్ గా ఉంటానంటూ చెప్పడం జరిగింది. కాగా, దిల్ రాజు - ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో సినిమా తీయాలని గతంలోనే అనుకున్నారట. ప్రశాంత్ నీల్ హీరో ప్రభాస్ తో మరో సినిమా తీయాలని అనుకున్నారట. ఒకవేళ ప్రశాంత్ నీల్ ప్రభాస్ కాంబినేషన్లో సినిమా వచ్చినట్లయితే ఈ సినిమాకు నిర్మాతగా దిల్ రాజు వ్యవహరించాలని ప్లాన్ లో ఉన్నారట.
మరి ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించే సినిమాలో రామ్ చరణ్ హీరోగా చేసే అవకాశాలు ఉన్నాయని సమాచారం అందుతోంది. వీరిద్దరి కాంబినేషన్లో రాబోయే సినిమాలో హీరోగా ప్రభాస్ కానీ, రామ్ చరణ్ కానీ ఎవరో ఒకరు నటించబోతున్నారట. ప్రశాంత్ నీల్ తెరకెక్కించే సినిమాలు అన్ని బ్లాక్ బస్టర్ విజయాలను సొంతం చేసుకుంటున్న సంగతి తెలిసిందే.