
హీరోయిన్ కు భర్త స్ట్రాంగ్ వార్నింగ్....బాలయ్యతో సినిమాలు వద్దంటూ?
విజయశాంతి తన కెరీర్ లో చిరంజీవి, బాలకృష్ణ లతోనే ఎక్కువ సినిమాలలో నటించింది. బాలకృష్ణతో కలిసి విజయశాంతి దాదాపు 17 సినిమాలలో నటించింది. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన సినిమాలన్నీ బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసాయి. ఒకానొక సమయంలో బాలకృష్ణ, విజయశాంతి వివాహం చేసుకుంటారనే ప్రచారాలు కూడా జోరుగా సాగాయి. అయితే ఈ ప్రచారానికి తెరదించుతూ ఇండస్ట్రీకి ఎటువంటి సంబంధంలేని వ్యక్తిని విజయశాంతి వివాహం చేసుకోవడం జరిగింది.
పెళ్లి తర్వాత కూడా విజయశాంతి సినిమాలలో నటించారు. కానీ బాలకృష్ణతో మాత్రం కలిసి ఎలాంటి సినిమాలలో నటించలేదు. అయితే తన భర్త పెట్టిన కండిషన్ కారణంగానే విజయశాంతి హీరో బాలకృష్ణతో కలిసి నటించిన రూమర్స్ తెరమీదకు జోరుగా వచ్చాయి. అయితే అలాంటిది ఏమీ లేదని తర్వాత వెళ్లడైంది. పెళ్లి అనంతరం విజయశాంతి లేడీ ఓరియంటెడ్ సినిమాలు మాత్రమే చేశారు.
హీరోలతో సమానంగా విజయశాంతి నటించిన అనేక సినిమాలు తెరకెక్కాయి. దీంతో హీరోలతో సినిమాలు చేయడం ఆమె తగ్గించేశారు. ఇప్పటికి కూడా విజయశాంతి తన సినిమాలతో అభిమానులను అలరిస్తోంది. అయితే హీరోయిన్ గా కాకుండా తల్లి, అక్క, అత్త వంటి పాత్రలను పోషిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. కాగా టాలీవుడ్ నటి, కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత విజయశాంతి... సరిలేరు నీకెవరు సినిమాతో రీ- ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే.