విజ‌య్ దేవ‌ర‌కొండ హిట్టు మొఖం చూసి ఐదేళ్లు... హిట్ ఎప్ప‌టికి వ‌చ్చేనో..!

frame విజ‌య్ దేవ‌ర‌కొండ హిట్టు మొఖం చూసి ఐదేళ్లు... హిట్ ఎప్ప‌టికి వ‌చ్చేనో..!

RAMAKRISHNA S.S.
- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . . .

టాలీవుడ్ లో రౌడీ హీరో విజయ్ దేవరకొండ ఏడెనిమిది సంవత్సరాల క్రితం వరుస సూపర్ డూపర్ హిట్ సినిమాలతో ఒక్కసారిగా స్టార్ హీరోలుకు చెమటలు పట్టించారు. పెళ్లిచూపులు - అర్జున్ రెడ్డి - గీత గోవిందం లాంటి సినిమాలు విజయ్ దేవరకొండ క్రేజ్ను ఒక్కసారిగా తీసుకువెళ్లే ఆకాశంలో కూర్చోపెట్టేసాయి. ఆ టైంలో విజయ్ దేవరకొండకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ వచ్చేసింది. విజయ్ దేవరకొండ మార్కెట్ ఆ రోజుల్లోనే దాదాపు 60 కోట్లకు చేరుకుంది. ఈ మూడు సినిమాలకు థియేటర్ వసూళ్లు కూడా అదిరిపోయాయి. విజయ్ దేవరకొండ మేనరిజంకు యూత్లో పిచ్చ క్రేజ్‌ వచ్చేసింది. అలాంటి విజయ్ దేవరకొండకు ఇప్పుడు సీన్ పూర్తిగా రివర్స్ అయిపోయింది. పాపం విజ‌య్ కు స్టార్ డమ్ వచ్చినట్టే వచ్చి పోయింది. స్టార్ డ‌మ్ అలా  వచ్చిందో లేదో ఇలా ప్లాప్ లు స్టార్ట్ అయ్యాయి.  

కెరీర్ స్టార్ట్ చేసిన దగ్గరనుంచి పెళ్లిచూపులు, అర్జున్ రెడ్డి, గీతగోవిందం. ఇలా బ్యాక్ టు బ్యాక్  మూడు సినిమాలతో హ్యాట్రిక్ కొట్ట‌డంతో పాటు టాలీవుడ్ లో ఎంద‌రో హీరోల‌కు లేని రికార్డుల కుంభ స్థ‌లాన్ని కూడా కొట్టేశాడు. ట్విస్ట్ ఏంటంటే.. ఈ మూడు సినిమాలు  తప్ప మిగిలిన సినిమాలన్నీప్లాప్ అవుతూ వస్తున్నాయి. 2018 దగ్గర నుంచి విజ‌య్ కు పట్టుమని ఒక్క హిట్  పడలేదు. పూరి జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వం లో చేసిన భారీ పాన్ ఇండియా సినిమా లైగర్ లాంటి సినిమాలు పెద్ద దెబ్బకొట్టాయి. ఆ త‌ర్వాత చేసిన ఖుషి .. ఫ్యామిలీ స్టార్ లాంటి సినిమాలు కూడా ప్లాప్ కిందే లెక్క‌. ఏదేమైనా ఇన్నేళ్ల త‌ర్వాత ఓ సాలిడ్ కమ్ బ్యాక్ కోసం ఎదురు చూస్తున్నాడు రౌడీ హీరో. మ‌రి రౌడీ హీరో ఆశ‌లు ఎంత వ‌ర‌కు నెర‌వేర‌తాయో ?  చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: