
టాలీవుడ్‌లో ఈ వేసవి ఇంత డల్‌గానా.. సినీ లవర్స్‌కు నిరాశే..!
టాలీవుడ్ లో వాసవి వచ్చింది అంటే చాలు మంచి అంచనాలు ఉన్న సినిమాలు థియేటర్లలోకి దిగేవి .. తెలుగు సినీ ప్రేమికులకు కాస్త వినోదం పంచేవి .. అయితే గత ఏడాది సమ్మర్ చాలా నిరుత్సాహంగా ముగిసింది .. అయితే ఈ ఏడాది కూడా టాలీవుడ్ లో సమ్మర్ సీజన్ నిరుత్సాహంగా ఉండేలా కనిపిస్తోంది .. మామూలుగా సమ్మర్ సీజన్ అంటే బాక్సాఫీస్ భగభగలాడాలి రికార్డులు సలసలా కాగాలి థియేటర్లో కటకటలాడిపోవాలి కానీ సమ్మర్ కు వస్తాయనుకున్న పెద్ద సినిమాలు వాయిదా పడుతున్నాయి .. ప్రభాస్ రాజాసాభ్ సినిమాతో ఈ వేసవి బాక్సాఫీస్ వేడెక్కుతుందని అందరూ అనుకున్నారు .. ఏప్రిల్ 10న రావాల్సిన ఈ సినిమా వాయిదా పడింది ..
అటు పవన్ కళ్యాణ్ అభిమానుల పరిస్థితి కూడా అలాగే ఉంది .. వేసవి సెలవులో హరిహర వీరమల్లు సినిమాతో గ్రాండ్గా మొదలవుతాయని అందరూ అనుకున్నారు .. మార్చి 28 సినిమా ఉంటుందని చెబుతున్న అనుమానంగానే కనిపిస్తోంది పరిస్థితి ఏమంత ఆశాజనకంగా లేదు .. ఇక సమ్మర్ రేస్ లో ఉన్న మూడో పెద్ద సినిమా మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర సంక్రాంతికి రావలసిన ఈ సినిమా సమ్మర్ లో సందడి చేస్తుందని అంతా అనుకున్నారు .. ప్రస్తుతాని అయితే ఈ సినిమా మే 9 కి వచ్చే అవకాశం ఉందని అంటున్నారు .. అయితే అధికారికి ప్రకటన మాత్రం రాలేదు విశ్వంభర వరకు కూడా సమ్మర్ రేస్ నుంచి తప్పుకుంటే ఒక పెద్ద సినిమా కూడా లేకుండా ఈ వేసవి ముగిసేలా ఉంది .. హిట్ 3 , కన్నప్ప , జాక్ రాబిన్ హుడ్ , తమ్ముడు లాంటి సినిమాలతో ఈ సర్దుకోవాల్సిందే .. గత ఏడది వేసవి పరిస్థితి ఎలా ఉందో ఈ ఏడది కూడా తెలుగు సినీ ప్రేమికులకు నిరాశ తప్పేలా లేదు ..