![పుష్ప2 ఓటీటీ విషయంలో ట్విస్టులు.. అదనంగా డబ్బులు చెల్లించాలట కానీ?](https://www.indiaherald.com/cdn-cgi/image/width=350/imagestore/images/lifestyle/taurus_taurus/aiken--allu-arjun-pushpa2-country--pushpa2-movie9080605e-91b9-4dd5-a8ca-4fa21ab3f7c0-415x250.jpg)
పుష్ప2 ఓటీటీ విషయంలో ట్విస్టులు.. అదనంగా డబ్బులు చెల్లించాలట కానీ?
పుష్ప2 మూవీ ఓటీటీ రిలీజ్ విషయంలో ఊహించని ట్విస్టులు చోటు చేసుకుంటూ ఉండటంతో సినీ అభిమానులు సైతం ఒకింత ఆశ్చర్యానికి గురవుతున్నారు. పుష్ప2 మూవీ ఎలాంటి రుసుము చెల్లించకుండా ఓటీటీలో ఎప్పటినుంచి స్ట్రీమింగ్ అవుతుందో చూడాల్సి ఉంది. పుష్ప2 ఓటీటీ స్ట్రీమింగ్ విషయంలో నెలకొన్న ట్విస్ట్ గురించి తెలిసి నెటిజన్లు సైతం ఒకింత షాకవుతున్నారు.
పుష్ప2 మూవీ థియేటర్లలో ఏకంగా 1900 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఫుల్ రన్ లో ఈ సినిమా 2000 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను సొంతం చేసుకునే అవకాశం అయితే ఉంది. పుష్ప ది రూల్ మూవీ రీలోడెడ్ వెర్షన్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుండటం గమనార్హం. పుష్ప2 మూవీ హీరోయిన్ రష్మిక కెరీర్ కు సైతం ఎంతగానో ప్లస్ అయింది.
2024 సంవత్సరం బిగ్గెస్ట్ హిట్లలో పుష్ప ది రూల్ మూవీ ఒకటిగా నిలిచింది. బన్నీ తర్వాత సినిమాలు సైతం పుష్ప ది రూల్ స్థాయిలో కలెక్షన్లు సాధిస్తాయో లేదో చూడాల్సి ఉంది. వరుస విజయాలతో బన్నీ పారితోషికం ఒకింత భారీ స్థాయిలో ఉందని సమాచారం అందుతోంది. అల్లు అర్జున్ ఇతర భాషల్లో సైతం అంతకంతకూ క్రేజ్ ను పెంచుకుంటుండగా బన్నీకి పెరుగుతున్న ఫ్యాన్ ఫాలోయింగ్ అందరినీ షాక్ కు గురి చేస్తోంది. పుష్ప2 ఓటీటీ వెర్షన్ ఎలాంటి రెస్పాన్స్ అందుకుంటుందో చూడాల్సి ఉంది.