బాహుబలి 2 : 50 రోజుల పండగ, 1050 సెంటర్లు..ప్రభాస్‌ అరుదైన రికార్డు?

frame బాహుబలి 2 : 50 రోజుల పండగ, 1050 సెంటర్లు..ప్రభాస్‌ అరుదైన రికార్డు?

Veldandi Saikiran
టాలీవుడ్ ఇండస్ట్రీలో అనేక రకాల సినిమాలు వస్తున్నాయి. అలా వచ్చిన సినిమాలలో... 50 రోజులపాటు ఒక్క సినిమా ఆడే పరిస్థితి ఇప్పుడు లేదు. కానీ ప్రభాస్ నటించిన బాహుబలి, బాహుబలి 2 రెండు సినిమాలు కూడా 50 రోజుల పండగను... చాలా థియేటర్లలో  జరుపుకున్నాయి. 2015 సంవత్సరంలో రాజమౌళి దర్శకత్వంలో.... ప్రభాస్ హీరోగా బాహుబలి ద బిగినింగ్ వచ్చిన సంగతి తెలిసిందే.

ఈ సినిమాలో ప్రభాస్ హీరోగా చేస్తే అనుష్క  హీరోయిన్గా చేసింది. ప్రభాస్ డ్యూయల్ రోల్ చేయడమే కాకుండా... అనుష్క... ఈ సినిమాలో ప్రభాస్ కు భార్యగా అలాగే తల్లిగా నటించింది. దగ్గుబాటి రానా విలన్ గా చేశాడు.  సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ ప్రభాస్ తల్లి పాత్రలో కనిపించారు. అయితే ఈ సినిమా 2015 సంవత్సరంలో రిలీజ్ అయి మంచి కలెక్షన్ రాబట్టింది. 108 కోట్లతో ఈ సినిమా తీస్తే దాదాపు 1000 కోట్ల వరకు వచ్చిందట.

అంతేకాదు దాదాపు 129 సెంటర్లలో 50 రోజుల రన్ టైం పూర్తి చేసుకుని బాహుబలి ద బిగినింగ్ సినిమా. ఇలా 50 రోజుల పండుగను 129 సెంటర్లలో చేసుకోవడం... చాలా రోజుల తర్వాత జరిగింది. దీంతో ప్రభాస్ హిస్టరీ క్రియేట్ చేశాడు. ఇక బాహుబలి 2 సినిమా 2017 సంవత్సరంలో రిలీజ్ అయి చరిత్ర సృష్టించింది. ఈ సినిమా 2017 సంవత్సరంలోనే దాదాపు 18 వందల కోట్ల వరకు వసూలు చేపట్టిందట.

అయితే ఇటీవల పుష్ప  2 సినిమా మాత్రం ఈ సినిమాను.. బ్రేక్ చేసింది. కానీ బాహుబలి ద కన్ఫ్యూషన్ సినిమా మాత్రం...1050 సెంటర్లలో 50 రోజుల రన్ టైం పోస్ట్ చేసుకొని... చరిత్ర సృష్టించింది. దేశవ్యాప్తంగా పనినించే స్థాయిలో రిలీజ్ అయిన ఈ సినిమా 1050 థియేటర్లలో...  50 రోజుల పండుగను జరుపుకుంది. ఇక ఇలాంటి అరుదైన రికార్డును బాలయ్య అఖండ బీట్ చేసే ప్రయత్నం చేసింది. కానీ అందుకోలేదు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: