టాలీవుడ్ అగ్ర దర్శకుడు రామ్ గోపాల్ వర్మను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసులు వదలడం.. లేదు. ఇప్పటికే ఏపీలోని పలు స్టేషన్లలో రాంగోపాల్ వర్మపై కేసు నమోదు అయిన సంగతి తెలిసిందే. నవంబర్ నెలలో రాంగోపాల్ వర్మపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు కాగా.... అప్పుడే రాంగోపాల్ వర్మను అరెస్టు చేస్తారని అందరూ అనుకున్నారు. కానీ హైకోర్టు.. ఆదేశాలు ఇవ్వడంతో రాంగోపాల్ వర్మను అరెస్టు చేయలేదు పోలీసులు.
దీంతో రాంగోపాల్ వర్మ రిలాక్స్ అయ్యాడు. అయితే తాజాగా మరోసారి దర్శకుడు రాంగోపాల్ వర్మకు ఊహించని షాక్ ఇచ్చింది ఏపీ పోలీస్ శాఖ. మరోసారి రాంగోపాల్ వర్మ ఏపీ పోలీసులు నోటీసులు జారీ చేయడం జరిగింది. ఫిబ్రవరి 4వ తేదీన కచ్చితంగా విచారణకు హాజరు కావాలని ఒంగోలు పోలీసులు... రాంగోపాల్ వర్మ కు నోటీసులు జారీ చేశారు. ఈ మేరకు రామ్ గోపాల్ వర్మ వాట్సాప్ నెంబర్ కు నోటీసులు కూడా పంపించారు ఒంగోలు రూరల్ సిఐ శ్రీకాంత్.
ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అలాగే ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఫోటోలు మార్ఫింగ్ చేసిన కేసులో రామ్ గోపాల్ వర్మపై కేసులు నమోదు అయ్యాయి. ఒక్క స్టేషన్ కాదు ఆంధ్రప్రదేశ్లో ఉన్న చాలా స్టేషన్లో ఇదే విషయంపై రామ్ గోపాల్ వర్మపై కేసులు పెట్టారు టిడిపి నేతలు.
దీంతో రంగంలోకి దిగిన ఏపీ పోలీసులు... నవంబర్ 10వ తేదీన రాంగోపాల్ వర్మపై మద్దిపాడు పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఆ తర్వాత నవంబర్ 19 అలాగే నవంబర్ 25వ తేదీలలో... రెండుసార్లు వర్మకు నోటీసులు ఇచ్చారు. అయినా కూడా విచారణకు హాజరుకాకుండా అజ్ఞాతంలోకి వెళ్లారు రామ్ గోపాల్ వర్మ. కోర్టు నోటీసులు తీసుకు వచ్చిన తర్వాత మళ్లీ బయటకు వచ్చారు. అయితే ఇలాంటి నేపథ్యంలో మరోసారి ఒంగోలు పోలీసులు నోటీసులు ఇవ్వడం జరిగింది. మరి ఈ నోటీసులపై రాంగోపాల్ వర్మ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.