వామ్మో: జైలర్ 2 కి అనిరుద్ ఎంత తీసుకుంటున్నాడో తెలుసా..?

frame వామ్మో: జైలర్ 2 కి అనిరుద్ ఎంత తీసుకుంటున్నాడో తెలుసా..?

Divya
ఈ మధ్యకాలంలో అన్ని ఇండస్ట్రీలోని మ్యూజిక్ డైరెక్టర్లు సైతం అన్ని భాషలలో తమ హవా కొనసాగించాలని విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఏఆర్ రెహమాన్, దేవిశ్రీప్రసాద్, తమన్ తదితర వంటి వారు టాప్ పొజిషన్ లో ఉన్నారని చెప్పవచ్చు.. ముఖ్యంగా ఏఆర్ రెహమాన్ తర్వాత అంతటి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ అనిరుద్ కూడా ఉందని చెప్పవచ్చు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో పాటు పాటలను కూడా హైలెట్ చేస్తూ ఉంటారు అనిరుద్. సినిమాల సక్సెస్ కి కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తూ ఉన్నారు.


అతి తక్కువ సమయంలోనే మంచి సక్సెస్ అందుకున్న సంగీత దర్శకుడుగా అనిరుద్ పేరు సంపాదించారు. మొదట3 సినిమాతో వై దిస్ కొలవరి అంటూ పాట పాడి యూట్యూబ్ ని షేక్ చేశారు.. ఆ తర్వాత జెర్సీ, విక్రమ్, మాస్టర్, బీస్ట్, జైలర్, దేవర ,జవాన్ తదితర చిత్రాలకు సంగీతాన్ని అందించారు. క్రేజ్ పెరగడంతో పాటు రెమ్యూనరేషన్ కూడా అమాంతం పెంచేశారట అనిరుద్. జైలర్ చిత్రానికి 8 నుంచి 10 కోట్ల రూపాయలు తీసుకున్నాడని టాక్ కోలీవుడ్లో వినిపించింది.


అయితే ఇప్పుడు జైలర్ 2 సినిమా రాబోతూ ఉండడంతో  మ్యూజిక్ డైరెక్టర్ గా అనిరుద్ధుని తీసుకోవడం జరిగింది. ఇటీవలే ఈ చిత్రానికి సంబంధించి గ్లింప్స్ విడుదల చేయక అందులో అనిరుద్ తో పాటు డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కూడా కనిపించారు.. తాజాగా జైలర్-2 కోసం 18 కోట్ల రూపాయలు డిమాండ్ చేసినట్లుగా అనిరుద్ వార్తలు వినిపిస్తున్నాయి. ఈ లెక్కన చూసుకుంటే ఇండియాలోనే అత్యధికంగా రెమ్యూనరేషన్ తీసుకున్న ఏ ఆర్ రెహమాన్ కూడా క్రాస్ చేశారనే విధంగా కోలీవుడ్ లో వార్తలు వినిపిస్తూ ఉన్నాయి.. మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ జైలర్ 2 సినిమాతో సక్సెస్ అందుకోవడం ఖాయం అనే విధంగా కనిపిస్తోందని అభిమానులు తెలుపుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: