విజయ్ దేవరకొండ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. 2016లో పెళ్లిచూపులు సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీకి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. అంతకుముందే కొన్ని సినిమాలలో కీలక పాత్రను పోషించినప్పటికీ పెద్దగా గుర్తింపు రాలేదు. పెళ్లి చూపులు సినిమాలో తన అద్భుతమైన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. పెళ్లిచూపులు సినిమా తర్వాత వరుసపెట్టి సినిమాలు చేసుకుంటూ టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఆగ్ర హీరోగా తన హవాను కొనసాగిస్తున్నారు.
ప్రస్తుతం విజయ్ దేవరకొండ ఎప్పటికప్పుడు ఏదో ఒక సినిమాతో అభిమానుల ముందుకు వస్తూనే ఉన్నాడు. హిట్లు, ఫ్లాపులు అనే తేడా లేకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూ పోతున్నాడు. చేతినిండా సినిమాలతో బిజీగా ఉంటున్నాడు. విజయ్ దేవరకొండ సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటారు. తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటూ.... వారికి చేరువలో ఉంటాడు. కాగా....విజయ్ దేవరకొండ హీరోగా, రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో ఓ సినిమా రాబోతోంది.
మైత్రి మూవీ మేకర్స్ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తుంది. వీడీ 14 అనే వర్కింగ్ టైటిల్ తో రూపొందిస్తున్న ఈ సినిమా తాలూకు సంబంధించిన సెట్ వర్క్ ను ఆదివారం రోజున ప్రారంభించారు. ఈ సందర్భంగా సినిమా దర్శకుడు రాహుల్ సంకృత్యాన్ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ ఈ సినిమా కథ గురించి వెల్లడించాడు. ఈ సినిమా పీరియాడిక్ యాక్షన్ డ్రామా అని తెలియజేశాడు. బ్రిటిష్ పాలనా కాలం సమయంలో వచ్చిన సినిమాలలో ఇప్పటివరకు ఎవరు ముట్టుకొని విధంగా ఈ సినిమా కథ ఉంటుందని చెప్పాడు.
విజయ్ పాత్ర నవ్య రీతిలో సాగుతుందని తెలియజేశాడు. యదార్ధ చారిత్రక సంఘటన ఆధారంగా పాన్ ఇండియా రేంజ్ లో ఈ సినిమాని తెరకెక్కించబోతున్నామని చిత్ర యూనిట్ వెల్లడించారు. కాగా, బ్రిటిష్ కాలం కథ అంటే ఇది వరకే వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. మరి వీరిద్దరి కాంబినేషన్లో రాబోయే సినిమా ఏ మేరకు ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో చూడాలి.