
డెలివరీ తర్వాత గుర్తుపట్టని విధంగా హీరోయిన్ ?
డెలివరీ అనంతరం దీపిక పదుకొనే నాలుగు నెలల తర్వాత బయటకు వచ్చింది. దీపికను చూసి ప్రస్తుతం ప్రతి ఒక్కరూ షాక్ అవుతున్నారు. ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ సభ్యసాచి ముఖర్జీ ప్రతి ఒక్కరికి సుపరిచితమే. బాలీవుడ్ చిత్ర పరిశ్రమకు అతనికి ఎంతో అవినాభావ సంబంధం ఉంది. బాలీవుడ్ లోని సెలబ్రిటీలందరికీ సభ్యసాచి డిజైన్ చేయడం గమనార్హం. కాగా, సభ్యసాచి ముఖర్జీ బ్రాండ్ 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ముంబైలో ఓ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే ర్యాంప్ వాక్ చేసింది.
వైట్ కలర్ డ్రెస్ ధరించి ర్యాంప్ వాక్ చేయగా ఈ వీడియో విపరీతంగా వైరల్ అవుతుంది. ఆమెను అలా చూడగానే అభిమానులు, నెటిజన్లు షాక్ అవుతున్నారు. డెలివరీ అనంతరం దీపిక చాలా బొద్దుగా మారిపోయిందని అంటున్నారు. ఆమె నటి రేఖల ఉన్నారని కామెంట్ చేస్తున్నారు. మరి కొంతమంది ఈమె దీపికనా, లేకపోతే రేఖనా అని అంటున్నారు. డెలివరీ తర్వాత దీపికా పదుకొనే పూర్తిగా మారిపోయింది.
కాగా, సంజయ్ లీలా బన్సాలి తెరకెక్కించిన రామ్లీలా సినిమాలో దీపికా పదుకొనే, రణవీర్ సింగ్ కలిసి జంటగా నటించారు. ఈ సినిమా సమయంలోనే వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. ఇరు కుటుంబాల అంగీకారంతో 2018లో ఇటలీలోని లేక్ కోమాలో వివాహం చేసుకున్నారు. వివాహం తర్వాత రన్వీర్, దీపిక సినిమాలతో బిజీగా ఉన్నారు. గత సంవత్సరం ఓ బిడ్డకు జన్మనిచ్చారు. ఇక గర్భిణిగా ఉన్న సమయంలోనే దీపిక కల్కి 2898 ఏడి అనే తెలుగు సినిమాలో నటించి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ప్రస్తుతం దీపిక తన మాతృత్వాన్ని ఆస్వాదిస్తోంది. బిడ్డతో కలిసి ఇంట్లోనే సమయాన్ని గడుపుతోంది.