మహేష్ బాబు : జక్కన్న కోసం కొత్త ఫీట్స్.. ఈ వయసులో అవసరమా?

Veldandi Saikiran
" data-original-embed="" >
సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి తెలియని వారంటూ ఎవరు ఉండరు. అతి చిన్న వయసులోనే సినిమాల్లోకి హీరోగా ఎంట్రీ ఇచ్చిన మహేష్ బాబు తన నటనతో ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నాడు. మహేష్ బాబు ఇప్పటివరకు నటించిన సినిమాలన్నీ మంచి విజయాలను అందుకున్నాయి. రీసెంట్ గా మహేష్ బాబు నటించిన చిత్రం గుంటూరు కారం. ఈ సినిమా మిక్స్డ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ కలెక్షన్లు భారీగానే వచ్చాయి. ఇక మహేష్ బాబు తన తదుపరి సినిమాను రాజమౌళితో చేయడానికి రెడీ అయ్యాడు. ఇప్పటికే ఈ సినిమా కోసం మహేష్ బాబు తన పూర్తి లుక్స్, మేకోవర్ మార్చుకున్నాడు. 



అతనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మహేష్ బాబు-రాజమౌళి కాంబినేషన్లో రాబోయే సినిమా కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాను అత్యంత ప్రతిష్టాత్మకంగా హాలీవుడ్ రేంజ్ లో నిర్మించబోతున్నారు. ఈ సినిమాకు ఎస్ఎస్ఎంబి29 అనే వర్కింగ్ టైటిల్ పేరుతో రాబోతుంది. ఇంకా టైటిల్ ను ఖరారు చేయలేదు. 



ఈ సినిమాను అమెజాన్ అడవుల నేపథ్యంలో నాన్ స్టాప్ అడ్వెంచర్ గా తీయబోతున్నారు. ఇప్పటికే అల్యూమినియం ఫ్యాక్టరీలో సెట్ లను నిర్మించి కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. ఇందులో మహేష్ బాబు సరసన హీరోయిన్ గా బాలీవుడ్ భామ ప్రియాంక చోప్రా నటిస్తుందని సమాచారం అందుతుంది. కాగా, ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైందని రాజమౌళి నిన్న హింట్ కూడా ఇచ్చారు. 



తాజాగా మహేష్ బాబు ఫోటోలు కూడా వైరల్ అవుతున్నాయి. ఆయన జిమ్ లో ప్రాక్టీస్ చేసినట్లుగా సమాచారం అందుతుంది. ట్రైనర్ తో పాటు ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయగా.... రిహార్సల్స్ ప్రారంభమయ్యాయని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. ఇక మరికొందరు ఏమో ఈ వయసులో జిమ్ లో కసరత్తులు చేయడం అవసరమా అని నెగటివ్ గా కామెంట్లు చేస్తున్నారు.






మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: