బాల‌య్య - బోయ‌పాటి సినిమా విజ‌య‌వాడ స్టోరీ కూడానా..!

frame బాల‌య్య - బోయ‌పాటి సినిమా విజ‌య‌వాడ స్టోరీ కూడానా..!

RAMAKRISHNA S.S.
- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . . .

నందమూరి నట‌సింహం బాలకృష్ణ ప్రస్తుతం కెరీర్‌లో ఫుల్ స్వింగ్‌లో ఉన్నారు. అటు వెండితెరపై వరుస సూపర్ డూపర్ హిట్ సినిమాలతో దూసుకుపోతున్నారు. అఖండ సినిమాతో మొదలైన బాలయ్య విజయాల పరంపర.. వరుసగా కంటిన్యూ అవుతోంది. వరుసగా అఖండ, వీర సింహరెడ్డి, భగవంత్ కేసరి, తాజాగా సంక్రాంతికి డాకు మహారాజ్‌ సినిమాలు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. బాలయ్య తర్వాత సినిమా కూడా బోయపాటి శ్రీను దర్శకత్వంలో అఖండ 2 తాండవం కావడంతో ఆ సినిమాపై కూడా మంచి అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాలో హీరోయిన్లు గా ప్ర‌గ్య జైశ్వాల్ తో పాటు సంయుక్త మీన‌న్ కూడా మ‌రో హీరోయిన్ గా ఎంపిక‌య్యారు.

అఖండ 2 తర్వాత బాలయ్య మరోసారి మలినేని గోపీచంద్ దర్శకత్వంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే బాలయ్య సినిమాలకు సహజంగానే ఫ్లాష్ బ్యాక్‌లో రాయలసీమ నేపద్యం ఎక్కువగా ఉంటుంది. బాలయ్య హిట్ సినిమాలలో రాయలసీమ నేపథ్యం ఉన్న సినిమాలు ఎక్కువగా ఉన్నాయి. సమరసింహారెడ్డి, నరసింహనాయుడు, వీర సింహారెడ్డి ఇలా చెప్పుకుంటూ పోతే చాలా సినిమాలకు రాయలసీమ నేపథ్యం ఉంటుంది. సీమ నేప‌థ్యం లో వ‌చ్చిన బాల‌య్య సినిమా లు ఎన్నో సూప‌ర్ డూప‌ర్ హిట్ అయ్యాయి.

అయితే ఇప్పుడు అఖండ‌ 2 సినిమాకు కృష్ణా జిల్లా నేపథ్యం ఉంటుందని తెలుస్తోంది. ఇది అఘోర నేపథ్యంలో సాగే కథ‌. కాగా కృష్ణానది ఒడ్డున కొన్ని సీన్లు షూటింగ్ చేస్తున్నారు. ప్రస్తుతం అఖండ 2 షూటింగ్ జరుగుతోంది. ఈ షెడ్యూల్ లో కీల‌క స‌న్నివేశాలు షూట్ చేస్తారు. తర్వాత షెడ్యూల్ విజయవాడలోని కృష్ణానది ఒడ్డున అలాగే.. కృష్ణా జిల్లాలో కృష్ణానది పరిసర ప్రాంతాలలో కొంత భాగం షూటింగ్ చేస్తారని తెలుస్తోంది. ఈ ఏడాది దసరాకు ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: