రూ.20 లక్షలు కూడా దొరుకలేదు...ఐటీ దాడులపై దిల్‌ రాజ్?

frame రూ.20 లక్షలు కూడా దొరుకలేదు...ఐటీ దాడులపై దిల్‌ రాజ్?

Veldandi Saikiran
మా ఇంట్లో రూ.20 లక్షల నగదు కంటే తక్కువే ఉందని క్లారిటీ ఇచ్చారు నిర్మాత దిల్‌ రాజ్‌. గడిచిన నాలుగు రోజులుగా తన కార్యాలయాలు, ఇంటిపై ఐటీ దాడులు జరుగగా.. ఆ సోదాలపై తాజాగా నిర్మాత దిల్‌ రాజ్‌ కీలక ప్రకటన చేశారు. గత ఐదేళ్ల నుంచి మేము ఎక్కడా ఎలాంటి ప్రాపర్టీస్ కొనలేదని... దేంట్లో కూడా మేము పెట్టుబడులు పెట్టలేదని వివరించారు దిల్ రాజు.



నాలుగు రోజులు నుంచి ఐటీ రైడ్స్ జరిగాయని తెలిపారు నిర్మాత దిల్‌ రాజు. నేను సెలెబ్రేట్ కాబట్టి మీడియా అంతా నా మీద ఫోకస్ చేసిందని పేర్కొన్నారు.  నాలుగు రోజులు నుండి ఏం జరిగింది అనేది చెప్పాలని వివరించారు నిర్మాత దిల్‌ రాజు.  2008 లో ఒకసారి సెర్చ్ జరిగిందని గుర్తు చేశారు. మళ్ళీ ఇప్పుడు జరిగిందని వెల్లడించారు నిర్మాత దిల్‌ రాజు.


మా కుటుంబం, ఆఫీస్ లో సెర్చ్ జరిగిందని పేర్కొనడం జరిగింది. స్టేట్మెంట్ తీసుకుంటారని వెల్లడించారు. మా దగ్గర డబ్బు కానీ, డాకుమెంట్స్ తీసుజున్నారని న్యూస్ వేసారని ఆగ్రహించారు నిర్మాత దిల్‌ రాజు. నా దగ్గర 5లక్షలు, శిరీష్ దగ్గర 4.50 లక్షలు, తీసుకున్నారన్నారు. మా ఇంట్లో రూ.20 లక్షల నగదు కంటే తక్కువే ఉందని క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు నిర్మాత దిల్‌ రాజు.


ఐటీ డిపార్ట్మెంట్ ఆశ్చర్యం పోయింది, దిల్ రాజు దగ్గర మేము ఏదో ఎక్సపెక్ట్ చేసాం అన్నారని వెల్లడించారు. మా అమ్మ కు సడెన్ గా దగ్గు వస్తే హాస్పిటల్ తీసుకెళ్తే, హార్ట్ అటక్ అని రాసారని ఆగ్రహించారు.  నన్ను ఎవరు టార్గెట్ చేయలేదని తెలిపారు. అందరి మీద ఐటీ దాడులు జరిగాయని గుర్తు చేశారు నిర్మాత దిల్‌ రాజు.  తాను ఎలాంటి తప్పు చేయలేదన్నారు.  కలెక్షన్స్ ఎక్కువ చేసి చూపించటం మీద ఇండస్ట్రీ అంతా కూర్చొని మాట్లాడాతామన్నారు దిల్‌రాజు..ఫిబ్రవరి 3 న ఐటీ అధికారులు కలవమన్నారని వివరించారు.  ఆడిటర్స్ వెళ్లి కలుస్తారన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: