
బాబాయ్ - అబ్బాయి .. ఇద్దరిదీ ఒకే టార్గెట్.. బాక్సాఫీస్ కు చుక్కలే..!
ఇక దాని ఫలితంగానే నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్, జై లవకుశ, అరవింద సమేత సినిమాలు ఎన్టీఆర్‌కు ఊహించని సక్సెస్ లు ఇచ్చాయి .. త్రిబుల్ ఆర్ మల్టీస్టరర్ కాబట్టి సినిమాను పక్కనపడితే ఇదే క్రమంలో ఎన్టీఆర్ సోలోగా హిట్ కొట్టిన సినిమాలేవి ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్స్ కాలేకపోయాయి .. సింహాద్రి తర్వాత మళ్లీ ఆ స్థాయి బ్లాక్ బస్టర్ లేదని ఆయన అభిమానుల ఆవేదన. అయితే ఇప్పుడు దేవర ఆ లోటు కొంతవరకు తీర్చిన పుష్ప 2 లాగా 1000 కోట్లు దాటి ఉంటే ఇంకా గర్వంగా చెప్పుకొని అవకాసం ఎన్టీఆర్ అభిమానులకు ఉండేదని కొందరు భావిస్తున్నారు .. అయితే ఈ వెర్షన్ తీసే పారాయలం కానీ .. వార్ 2ని పక్కన పెడితే ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబోకి అవకాశం 100% ఉందని వారు భావిస్తున్నారు.
బాలకృష్ణ కూడా గతంలో ఎన్టీఆర్ బయోపిక్ , రూలర్ సినిమాలు ఎంత తీవ్రంగా నిరాశపరచగా .. ఆ తర్వాత బ్యాక్ టు బ్యాక్ నాలుగు బ్లాక్ బస్టర్ విజయాలు అందుకున్నాడు .. అఖండ , వీర సింహారెడ్డి , భగవంత్ కేసరి ఇప్పుడు డాకు మహారాజ్ అన్ని బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాలు అందుకున్నాయి .. బాలయ్యతో పాటు ఉన్న సీనియర్ హీరోలలో చిరంజీవి , వెంకటేష్ అందుకున్న 100 కోట్లకు పైగా షేర్ మాత్రం ఇంకా ఆయన సాధించలేదు .. అదేవిధంగా 200 కోట్లు సైతం బాలయ్యకు అందని ద్రాక్షగా మిగిలిపోయింది .. ఇప్పుడు అఖండ 2 తో దాన్ని అందుకోవటం న్యాయమే .. ఇలా ఎన్టీఆర్ వెయ్యి కోట్లు, బాలయ్య రెండు లేదా మూడు వందల కోట్లను అందుకోవటమే టార్గెట్ గా పెట్టుకుని ముందుకు వెళ్లాలని అభిమానులు ఆకాంక్ష .. ఇది నెరవేరే మార్గం ఎంతో దూరంలో లేదని కూడా అంటున్నారు.