
అభిమానులకి ఉపాసన గుడ్ న్యూస్.. ఇంత ఈజీగా బయటపెట్టేసింది ఏంటి..?
మహేష్ బాబు తో రాజమౌళి ఒక ప్రాజెక్ట్ చేస్తున్నారు . ఈ సినిమా పూజ కార్యక్రమాలు కూడా గుట్టు చప్పుడు కాకుండా కంప్లీట్ చేసేసాడు జక్కన్న . ఈ సినిమాకు సంబంధించిన ఒక్క న్యూస్ కూడా బయటకు రానికుండా పకడ్బందీగా ప్లాన్ గా ముందుకు వెళుతూ ఉండడంతో సినీ డైరెక్టర్స్ కూడా షాక్ అయిపోతున్నారు. పెద్ద పెద్దగా చీఫ్ గెస్ట్ లను కూడా ఎవర్ని పిలవడం లేదు . సింపుల్గా తన పని తాను తీసుకెళ్లిపోతున్నాడు . సినిమాకి సంబంధించిన ఏ విషయం బయటకు రానికుండా ఉండడానికి ఇంత ప్లాన్ చేస్తున్నాడు అన్న విషయం కూడా బయటపడింది . దీంతో ఏదో ఈ సినిమాతో మ్యాజిక్ చేయబోతున్నాడు జక్కన్న ..ఇండస్ట్రీ రికార్డ్స్ మొత్తం బ్లాస్ట్ చేసి పడేస్తాడు అంటూ ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు .
అయితే ఇలాంటి మూమెంట్లోనే మహేష్ బాబు - రాజమౌళి కాంబోలో తెరకెక్కే సినిమాలో హీరోయిన్ ఎవరు అనేది బిగ్ హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. గత నాలుగు ఐదు రోజుల నుంచి సోషల్ మీడియాలో ప్రియాంక చోప్రా పేరు మారు మ్రోగిపోతుంది . తాజాగా హైదరాబాద్ కి రావడం హైదరాబాద్లో ఆమె స్టే చేయడం ఇందుకు ఇంకా బలం చేకూర్చింది. కాగా రీసెంట్గా చిలుకూరు బాలాజీ స్వామి టెంపుల్ దర్శించుకుని ఆ ఫొటోస్ ని సోషల్ మీడియాలో షేర్ చేసింది ప్రియాంక చోప్రా . అంతేకాదు తనకి హైదరాబాద్లో అన్ని వసతులు కనిపించిన రామ్ చరణ్ భార్య ఉపాసనకు స్పెషల్ థాంక్స్ కూడా చెప్పింది. ఉపాసన పోస్టికి రిప్లై ఇస్తూ.." మీ కొత్త సినిమా సక్సెస్ అవ్వాలి అని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను" అంటూ చెప్పుకొచ్చింది .
అంతే ఇక్కడితో అందరికీ 100% క్లారిటీ వచ్చేసింది. రామ్ చరణ్ భార్య ఉపాసన పెట్టిన ఒకే ఒక్క పోస్టు బిగ్ బడా ప్రాజెక్ట్ అయిన ఎస్ఎస్ఎంబి 29 సినిమాలో హీరోయిన్ ఎవరు అనేది బయట పడిపోయింది . ప్రియాంక చోప్రా నే మహేష్ బాబుకి హీరోయిన్ గా నటిస్తుంది అన్న విషయం కన్ఫర్మ్ అయిపోయింది . దీనితో సోషల్ మీడియాలో ఇప్పుడు ఫాన్స్ ఓ రేంజ్ లో హంగామా చేస్తున్నారు . అయితే రాజమౌళి లాంటి ఒక స్టార్ డైరెక్టర్ ప్రియాంక చోప్రాన్ని ఎందుకు ఈ సినిమాలో చూస్ చేసుకున్నాడు..? అనేది అర్థం కావడం లేదు. మహేష్ బాబు పక్కన ప్రియాంక చోప్రానా..? అంటూ కొంతమంది అసహనం కూడా వ్యక్తం చేస్తున్నారు . మరి కొంతమంది మాత్రం గ్లోబల్ బ్యూటీతో మహేష్ బాబు సినిమా ..నో డౌట్ గ్లోబల్ ఇమేజ్ కన్ఫర్మ్ మన మహేష్ బాబుకి అంటూ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు..!