కన్నడ బ్యూటీ ఆషిక రంగనాథ్ ప్రతి ఒక్కరికి సుపరిచితమే. తెలుగులో ఆషిక రంగనాథ్ కి ఎంతోమంది అభిమానులు ఉన్నారు. ఆమిగోస్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ చిన్నది రీసెంట్ గా నా సామి రంగ సినిమాతో మంచి హిట్ తన ఖాతాలో వేసుకుంది. తెలుగులో ఈ బ్యూటీ చేసింది తక్కువ సినిమాలే అయినప్పటికీ తనదైన శైలితో సపరేట్ ఫ్యాన్ బేస్ సంపాదించుకుంది. అందం, అభినయంతో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది. అతి చిన్న వయసులోనే ఇండస్ట్రీలోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది.
తన చదువు పూర్తవగానే మోడలింగ్ పై ఆసక్తి ఉండడంతో మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టింది. అనంతరం సినిమాలలోకి ఎంట్రీ ఇచ్చింది. తన నటన, అందం చూసి దర్శక నిర్మాతలు వరుసగా సినిమా అవకాశాలను ఇచ్చారు. అతి తక్కువ సమయంలోనే ఆషిక స్టార్ హీరోయిన్ గా గుర్తింపు సంపాదించుకుంది. ఈ అమ్మడు సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటుంది.
తాను షేర్ చేసే ఫోటోలకు విపరీతంగా అభి మానులు ఉన్నారు. ప్రస్తుతం రెండు మూడు సినిమా ప్రాజెక్టులతో ఈ చిన్నది బిజీగా ఉంది. వాటిలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా చెయబోయే విశ్వంభర సినిమాలో ఈ బ్యూటీ నటించే అవకాశాన్ని అందుకుంది. ఇదిలా ఉండగా.... ఈ బ్యూటీ తాజాగా వెకేషన్ కి వెళ్లి ఎంజాయ్ చేసింది. తన తల్లితో కలిసి యూరప్ ట్రిప్ కి వెళ్ళింది.
అక్కడ ఎంజాయ్ చేస్తూ దిగిన ఫోటోలను అభిమానులతో షేర్ చేసుకుని ఒక్క ఫోటోకి ఒక్కో క్యాప్షన్ జత చేసింది. వాటిలో పది ఫోటోలకు "మదీరా వైన్ టెస్ట్ చేస్తున్న" అంటూ చెప్పుకొచ్చింది. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. లిక్కర్ తాగుతూ ఇలా ఫోటోలు షేర్ చేసుకోవడంతో కొంతమంది అభిమానులు ఆగ్రహిస్తున్నారు. లిక్కర్ తాగడం అవసరమా అని నెగిటివ్ గా ట్రోల్ చేస్తు న్నారు.