చిరు మూవీ కోసం మళ్లీ ఆ సెంటిమెంట్ ను ఫాలో కానున్న అనిల్.. మరోసారి వర్కౌట్ అయ్యేనా..?

frame చిరు మూవీ కోసం మళ్లీ ఆ సెంటిమెంట్ ను ఫాలో కానున్న అనిల్.. మరోసారి వర్కౌట్ అయ్యేనా..?

Pulgam Srinivas
తెలుగు సినిమా పరిశ్రమలో దర్శకుడిగా మంచి గుర్తింపును సంపాదించుకున్న వారిలో అనిల్ రావిపూడి ఒకరు. ఈయన తాజాగా విక్టరీ వెంకటేష్ హీరోగా రూపొందిన సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ సినిమా నిన్న అనగా జనవరి 14 వ తేదీన సంక్రాంతి పండుగ సందర్భంగా థియేటర్లలో విడుదల అయింది. ఈ మూవీ కి అద్భుతమైన టాక్ రావడంతో ప్రస్తుతం ఈ సినిమా సూపర్ సాలిడ్ కలెక్షన్లను బాక్స్ ఆఫీస్ దగ్గర బస్సులు చేస్తుంది.

ఇకపోతే అనిల్ రావిపూడి తన తదుపరి మూవీ ని టాలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ హీరోలలో ఒకరిగా కెరియర్ను కొనసాగిస్తున్న మెగాస్టార్ చిరంజీవితో చేయబోతున్నాడు. ఇప్పటికే అందుకు సంబంధించిన విషయాన్ని అనిల్ రావిపూడి పలు సందర్భాలలో చెప్పుకొచ్చాడు. ఇక ఇప్పటికే అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా విడుదల అయ్యి మంచి టాక్ ను తెచ్చుకోవడంతో మరికొన్ని రోజుల తర్వాత అనిల్ , చిరంజీవి తో చేయబోయే సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులను ప్రారంభించబోతున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే ప్రీ ప్రొడక్షన్ పనులు మొత్తం కంప్లీట్ అయ్యాక ఈ సినిమా షూటింగ్ను కంప్లీట్ చేసి జెట్ స్పీడ్ లో కంప్లీట్ చేసి ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలి అనే ఆలోచనలో వెంకటేష్ ఉన్నట్లు తెలుస్తోంది.

ఇకపోతే ఈ సినిమాను వచ్చే సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల చేసే విధంగా అనిల్ రావిపూడి ప్రణాళికలను రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన ఎఫ్ 2 , ఎఫ్ 3 , సరిలేరు నీకెవ్వరు మరియు తాజాగా ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా సంక్రాంతికి వస్తున్నాం సినిమాలు సంక్రాంతికి విడుదల అయ్యి మంచి విజయాలను అందుకున్నాయి. ఇక మరోసారి తన సినిమాను సంక్రాంతి బరిలో నిలపాలి అనే ఆలోచనలో అనిల్ ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: